పవన్ కల్యాణ్ ప్రకృతి వైద్యం.. సర్జరీ వద్దంటున్న పవర్ స్టార్..pawan
2019-10-01 07:30:31

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. కొన్ని రోజులుగా ఆయన సినిమాలు కాకుండా పాలిటిక్స్ తోనే బిజీగా ఉన్నాడు. సినిమాలు చేస్తున్నపుడు ఎప్పటికప్పుడు ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టిన పవన్ ఇప్పుడు మాత్రం అలా చేయడం లేదు. అందుకే మాటిమాటికి ఈయన అనారోగ్యం పాలవుతున్నాడు. ఇప్పుడు కూడా విజయవాడలో 'మీడియా' సమావేశం ఏర్పాటు చేసింది. అందులో పాల్గొనాల్సిందిగా పవన్‌ కల్యాణ్‌ను ఆహ్వానించారు జన సైనికులు. కానీ దీనికి ఆయన రావడం లేదని సవినయంగా విన్నవించుకున్నాడు. దానికి కారణం కూడా చెబుతూ ఓ లేఖ కూడా రాసాడు పవర్ స్టార్. ఇక ఇప్పుడు దీనికి చికిత్స కూడా మొదలు పెట్టాడు పవన్. గతంలో గబ్బర్‌ సింగ్' సినిమా షూటింగ్ సమయంలో.. వెన్నుపూసకు తీవ్ర గాయమైంది. అప్పట్నుంచి ఆయన ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఇప్పుడు పట్టించుకోకపోవడంతో ఇంకా ఎక్కువైపోయింది. రాజకీయాల్లో బిజీ కావడంతో పవన్ ఆరోగ్యం కూడా దెబ్బతింది. కొన్ని రోజులుగా రెస్ట్ తీసుకోవాలని ఫిక్సైపోయాడు. మొన్న సైరా ఈవెంట్ లో కూడా ఇబ్బందిగానే కనిపించాడు పవన్ కల్యాణ్. అయితే మెడికల్ పద్దతిలో కాకుండా ప్రకృతి వైద్యానికి అలవాటు పడుతున్నాడు పవన్. పూర్తిగా నాచురల్ కేర్ తోనే ఆరోగ్యంగా మారాలని చూస్తున్నాడు. మరికొన్ని రోజుల వరకు ఎక్కడికి బయటికి రానని ముందే చెప్పేస్తున్నాడు పవన్ కల్యాణ్. జనసేన పనులు కూడా కార్యకర్తలే చూసుకోవాలని పిలుపునిచ్చాడు జనసేనాని.

More Related Stories