చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ తో ఆ దర్శకుడు సినిమా..Pawan Kalyan
2020-07-28 09:11:06

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కరోనా వైరస్ కానీ లేకపోయి ఉంటే ఈపాటికి ఈయన నుంచి వకీల్ సాబ్ వచ్చి ఉండేది. కానీ వైరస్ అంతా నాశనం చేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడు సినిమాలకు కమిట్ అయ్యాడు. ఇప్పటికే వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. దాంతోపాటు క్రిష్ తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఇది వచ్చే ఏడాది విడుదల కానుంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ తన లుక్ కూడా మార్చేశాడు. ఇక హరీష్ శంకర్ సినిమా ఎలాగూ ఉండనే ఉంది. గబ్బర్ సింగ్ వచ్చిన 8 సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో అభిమానులు గాల్లో తేలిపోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ మూడు సినిమాలతో పాటు మరో రెండు సినిమాలు కూడా పవన్ కళ్యాణ్ లైన్లో పెడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది.

అందులో ఒకటి తన ఆస్థాన దర్శకుడు, ఆప్తమిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరో సినిమా సంచలన దర్శకుడు కొరటాల శివ చేయబోతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ కోసం ఒక అద్భుతమైన కథ కొరటాల శివ సిద్ధం చేశాడు. భరత్ అనే నేను తర్వాత రెండేళ్లుగా ఏ సినిమా విడుదల చేయలేదు. కేవలం చిరంజీవి సినిమా పైన ఫోకస్ చేశాడు. ఆచార్య విడుదలైన తర్వాత వరుసగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు కొరటాల. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఉంది అని ప్రచారం జరుగుతోంది పవన్ ఇమేజ్ కి సరిపోయేలా కొరటాల రాసిన కథ చరిత్ర సృష్టించేలా ఉంటుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అన్ని కుదిరితే 2022లో ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తుంది. మరి అన్నయ్యకు ఆచార్య లాంటి సినిమా తెరకెక్కిస్తున్న కొరటాల.. పవన్ తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. 
 

More Related Stories