పవన్ కళ్యాణ్ ఎన్ని సినిమాలు చేస్తున్నాడు.. క్లారిటీ కావాలబ్బాయ్..Pawan Kalyan
2020-09-02 17:51:54

కొన్ని రోజుల క్రితం వరకు పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడం లేదు అంటూ అభిమానులు బాధ పడ్డారు. కానీ ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తున్నాడో తెలియక తికమక పడుతున్నారు. ఒకేసారి మూడు సినిమాలు ప్రకటించి ఆ మధ్య సంచలనం సృష్టించాడు పవన్ కళ్యాణ్. రాజకీయంగా కూడా ఇప్పుడు ఓ రకమైన స్తబ్దత ఏర్పడటంతో ఈ సమయాన్ని పూర్తిగా సినిమాలకు కేటాయిస్తున్నాడు పవర్ స్టార్. అలాగని జనం వద్దకు వెళ్ళడం ఆపడం లేడు జనసేనాని. అటు సినిమాలు ఇటు రాజకీయాలు రెండూ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ రీమేక్ వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నాడు. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. కరోనా పరిస్థితులు మెరుగు పడిన తర్వాత నెల రోజుల్లో సినిమాను విడుదల చేస్తామని చెప్పాడు నిర్మాత దిల్ రాజు. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ అదిరిపోయింది. ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ సినిమా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. కోహినూర్ డైమండ్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది. పవన్ పుట్టినరోజు సందర్భంగా ప్రీ లుక్ విడుదల చేశారు చిత్రయూనిట్.
వకీల్ సాబ్, క్రిష్ ఈ సినిమాలో ఇప్పటికే మొదలయ్యాయి.

ఇక హరీష్ శంకర్ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. గబ్బర్ సింగ్ తర్వాత గ్యాప్ తీసుకుని ఈ కాంబినేషన్ మళ్లీ వస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తిగా సందేశాత్మక కథతో రాబోతుందని కాన్సెప్ట్ పోస్టర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఈ మూడు సినిమాలు అందరికి తెలిసిందే. కానీ వీటితో పాటు పవన్ మరో మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. పవన్ 29వ సినిమాను సురేందర్ రెడ్డి  తెరకెక్కించబోతున్నాడు. పవన్ కళ్యాణ్ స్నేహితుడు రామ్ తాళ్లూరి దీనికి నిర్మాత. అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ ఇచ్చిన త్రివిక్రమ్ త్వరలోనే పవన్ బాకీ తీసుకోవాలని చూస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా తర్వాత మరోసారి పవన్ కాంబినేషన్ లో ఓ సినిమా చేయాలని ఆలోచిస్తున్నాడు. మరోవైపు కుర దర్శకుడు బాబీ.. పవన్ ఆస్థాన దర్శకుడు డాలీ కూడా డా ఈయనతో సినిమా కోసం ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి ఒకటి రెండూ కాదు పవన్ చేతిలో ఇప్పుడు అరడజను సినిమాలున్నాయి. ఎప్పుడు పూర్తవుతాయి అనేది మాత్రం కాలమే నిర్ణయిస్తుంది.

More Related Stories