సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి ..పవన్ కళ్యాణ్

2021-04-20 20:50:42
కేసీఆర్ కి కరోనా రావడం పై ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ''కె.సి.ఆర్ సంపూర్ణ ఆరోగ్యవంతులై ఎప్పటిలాగే ప్రజా సేవలో నిమగ్నం కావాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను. వారికి కోవిడ్ స్వల్ప లక్షణాలే ఉన్నాయనీ... ఎలాంటి ఇబ్బందీ లేదని వైద్యులు చెప్పడం తెలంగాణ ప్రజలందరికీ ఊరటను కలిగిస్తుంది'' అని పవన్ అన్నారు.
''మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కరోనాతో ఎయిమ్స్ లోచేరినట్లు సమాచారం అందింది. ఒక ఆర్థికవేత్తగా, దేశ ప్రధానిగా ఎన్నో సేవలు అందించిన మన్మోహన్ సింగ్ ఈ వ్యాధి నుంచి బయటపడి ఆరోగ్యవంతులు కావాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను'' అని తన ప్రకటనలో పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ .