బులెట్ పై పవర్ స్టార్ ఎంట్రీ..మేకింగ్ వీడియో అదుర్స్



 Pawan Kalyan
2021-01-26 17:19:07

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మలయాళ రీమేక్ "అయ్యప్పనుమ్ కొషియమ్" సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రానా కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే మరియు సంభాషణలు అందిస్తున్నారు. ఇక సినిమాలో హీరోయిన్ లుగా సాయి పల్లవి, ఐశ్వర్య రాజేష్ నటించ బోతునట్టు సమాచారం. అంతే కాకుండా సినిమాలో విలన్ గా సముద్రఖని కనిపించనున్నట్టు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా సినిమా షూటింగ్ ను నిన్న (జనవరి 25)న లాంఛనంగా ప్రారంభించారు. అయితే దానికి సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసింది. ఇక ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ కార్ లో నుండి దిగి షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టిన సన్నివేశాలను చూపించారు. అనంతరం త్రివిక్రమ్ తో కలిసి మాట్లాడుతూ పవన్ కనిపించారు. ఇక చివరగా వీడియోలో పవన్ కళ్యాణ్ బులెట్ నడుపుతూ కనిపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పవన్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక పదిరోజుల పాటు ఫైట్ సన్నివేశాలు చిత్రించనున్నట్టు మేకర్స్ తెలిపారు. 

More Related Stories