అకీరా సినీ ఎంట్రీకి రెడీ అయిపోయాడా Akhira Nandan
2020-08-23 16:50:42

పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ వేరు పడిన సంగతి తెలిసిందే. అయితే వారి పిల్లలి అకీరా, ఆద్యలు మాత్రం మెగా ఫ్యామిలీ మనుషుల లానే కలిసిపోతుంటారు. ఏ సెలెబ్రేషన్స్ జరిగినా వీరిద్దరు ఖచ్చితంగా వస్తున్నారు. అయితే ఇన్నాళ్లు పుణెలో ఉన్న అకీరా, ఆద్యలు హైద్రాబాద్‌కు షిఫ్ట్ అయ్యారనే వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. రేణు దేశాయ్‌ పుణెలో ఉండటం చేత పవన్ నుండి వేరుపడిన ఆమె ఆమె అక్కడికి వెళ్లి స్థిరపడింది. అయితే ఆమె ఆమె పుణె వదిలి హైదరాబాద్ షిఫ్ట్ అయినట్టు చెబుతున్నారు. ఇక అకీరాకి నటనలో శిక్షణ కూడా ఇప్పిస్తారని త్వరలోనే తెరంగ్రేటం కూడా చేయించేయవచ్చని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏదయినా ఉందా ? అంటే అతని హైట్ గురించే. 6.4 అడుగుల ఎత్తుతో ఇప్పటికి టాలీవుడ్ లో ఒక్క హీరో కూడద లేడు. ఇప్పుడు ఈ హైట్ లెక్కేస్తే వరుణ్ తేజ్ .. ప్రభాస్ ల కంటే అకీరా రెండు ఇంచులు ఎక్కువేనట. అయితే ఈ బడ్డ పవర్ స్టార్ సినిమాల్లోకి వస్తారా రారా? అనే ప్రశ్నకు రేణు దేశాయ్.. ఇంకా నిర్ణయించలేదట. దానికి ఇంకా టైమ్ ఉందని ఆ టైమ్ ఎప్పుడైనా రావొచ్చని అంటోంది.  

More Related Stories