చిరంజీవి సినిమా వేడుకలో పవన్ కల్యాణ్.. రామ్ చరణ్ అభ్యర్థనతో..pk
2019-09-07 07:43:32

ఈ మధ్య కాలంలో అన్నాదమ్ముల మధ్య మెలో డ్రామా బాగా పెరిగిపోతుంది. నీకునేను నాకునువ్వు అన్నట్లు ఉంటున్నారు చిరంజీవి, పవన్ కల్యాణ్. ప్రతీ చిన్న విషయం కూడా కలిసే చర్చిస్తున్నారు. ముఖ్యంగా అన్నకు అన్ని వేళలా తోడుగా కనిపిస్తున్నాడు తమ్ముడు. ఇప్పుడు సినిమాల విషయంలో కూడా. ప్రస్తుతం చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్ రాబోతున్నాడని తెలుస్తుంది. దీనికోసం బాబాయ్ దగ్గరికి నిర్మాత రామ్ చరణ్ స్వయంగా వెళ్లి మరీ ఆహ్వానం అందిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సెప్టెంబర్ లోనే జరగనుంది. సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ కూడా పెంచేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో.. ఆయన సొంతూరులోనే ఈ చిత్ర ప్రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కర్నూల్ పరిసర ప్రాంతంలో భారీగా సైరా ఈవెంట్ జరగబోతుంది. ఇందులో చిరంజీవితో పాటు పవన్ కల్యాణ్ కూడా ఒకే వేదికను షేర్ చేసుకోబోతున్నాడు. దానికితోడు సినిమాలో నటించిన మిగిలిన వాళ్లు.. మెగా హీరోలు కూడా రానున్నారు. అమితాబ్ బచ్చన్ మాత్రం ఇక్కడికి రావడం లేదని తెలుస్తుంది. ఎందుకో తెలియదు కానీ కొన్ని రోజులుగా ఈ చిత్రం ప్రమోషన్స్ కు దూరంగానే ఉంటూ వస్తున్నాడు అమితాబ్ బచ్చన్.

More Related Stories