క్రిష్ సినిమాతో బిజీ కాబోతున్న పవన్ Pawan Kalyan
2020-12-30 23:57:32

లాక్ డౌన్ తరువాత పవన్ కళ్యాణ్ సినిమాలతో బిజీ అయ్యాడు. ఇటీవల ప్రారంభమైన 'వకీల్‌సాబ్‌' షూట్‌ తాజాగా పూర్తయ్యింది. అయితే వకీల్ సాబ్ సినిమా షూట్ పూర్తి కావడంతో పవన్ కళ్యాణ్ నెక్స్ట్  ఏ సినిమాతో వస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే పవన్ నెక్స్ట్ క్రిష్ సినిమా షూట్ లోకి రాబోతున్నారు.  గతంలో అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసినభారీ సెట్స్ లో కొంత షూటింగ్ పూర్తి చేశారు.  అక్కడ కొంచెం వర్క్ చేసేస్తే, ఆ సెట్ తో పని అయిపోతుంది. అందుకే ముందుగా ఆ వర్క్ ఒక్కటీ పూర్తి చేసి, అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ మీదకు వస్తారని బోగట్టా. 'అజ్ఞాతవాసి' తర్వాత దాదాపు మూడేళ్లపాటు పవన్‌ సినిమాలకు దూరంగా ఉన్నారు. కొంతకాలంగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్‌ 'వకీల్‌సాబ్‌'తో రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో పవన్‌కు జోడీ శ్రుతిహాసన్‌ కనిపించనున్నారు. అలాగే నివేదాథామస్‌, అంజలి కీలకపాత్రల్లో మెప్పించనున్నారు.

More Related Stories