ప‌వ‌న్ సరసన.. కంచె బ్యూటీPawan Kalyan
2020-01-25 14:49:32

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసేందుకు ఒకేసారి రెండు సినిమాలను సెట్స్  పైకి తీసుకొచ్చారు. అందులో ఒకటి దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ హిట్ మూవీ పింక్ రీమేక్ కాగా.. మరోటి క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కనుంది. ఇప్పటికే పింక్ షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ సినిమాలో పవన్ కు సంబంధించిన ఫస్ట్ డే షూట్ ఫోటోలు బయటికి రావడంతో.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.  

ఇక.. పింక్ రీమేక్ తో పాటు క్రిష్ మూవీ కూడా ఈ నెల 27న సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ రెండు సినిమాలకు పవన్ కేవలం 20 నుంచి 30 రోజులు కాల్షీట్స్ ఇచ్చినట్టు వినిపిస్తోంది. ఇక ఈ సినిమా కోసం పవన్ సరసన హీరోయిన్ గా పలువురు ముద్దుగుమ్మల పేర్లు వినిపించాయి. అయితే తాజాగా క్రిష్ మూవీలో కంచె బ్యూటీ.. ప్రగ్యా జైస్వాల్ సెలెక్ట్ అయినట్టు సమాచారం. ఈ బ్యూటీని గతంలో క్రిష్.. వ‌రుణ్ తేజ్ 'కంచె' చిత్రంతో బ్రేక్ ఇచ్చాడు. ఆ అనుబంధంతోనే అమ్మడు ఇప్పుడు పవన్ ప్రాజెక్ట్ లోనూ ఛాన్స్ కొట్టేసినట్టు ఫిల్మ్ నగర్ టాక్. దాంతో ఫేడ్ అవుట్ అయిన ప్రగ్యాకు బంఫర్ వచ్చినట్టే అంటున్నారు. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. 

ఇకపోతే.. పవన్ నటిస్తున్న ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. పింక్‌ రీమేక్‌లో ప్రధాన పాత్రల్లో అంజలి, నివేదా థామస్‌, అనన్య పాండే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా హీరోయిన్ గా ఎవరు ఖరారు కాలేదు.. అసలు కథ పరంగా పింక్ రీమేక్ లో పవన్‌కు హీరోయిన్‌ ఉండదని తెలుస్తోంది. ఇక క్రిష్ మూవీకి హీరోయిన్ గా ప్రగ్యా పేరు వినిపిస్తుండడంతో.. దాదాపుగా కన్ఫామ్ అయినట్టే అంటున్నారు. ఇదిలా ఉంటే.. క్రిష్ సినిమాలో పవన్ దొంగగా నటించబోతున్నాడని.. ఇది టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ అని కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ప్రచారం అవుతోంది. మరి ఇందులో నిజనిజాలేంటో చిత్ర యూనిటే క్లారిటీ ఇవ్వాలి.

More Related Stories