పవన్ నోట మరో పాట..ఫ్యాన్స్ కి పండగే



Pawan Kalyan
2021-03-23 16:28:08

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఓ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న పవన్ ప్రస్తుతం మరో రెండు సినిమాలు చేస్తున్నారు. వాటిలో ఒకటి క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హరిహర వీరమల్లు కాగా మరో సినిమా మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియం రీమేక్. ఈ రీమేక్ సినిమాలో పవన్ మరియు రానా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ తన అభిమానులకోసం ఓ సాంగ్ ను పాడతారట. దాదాపు ఇది కన్ఫర్మ్ అయిపోయింది. ఇక పవన్ ఈ సినిమాలో ఓ ఫోక్ సాంగ్ తో అలరించబోతున్నారు. అయితే ఈ సాంగ్ ను సర్ప్రైజింగ్ గా ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. దాంతో సినిమాలో ఎలాంటి పాట తో పవన్ అలరిస్తారని ఆసక్తి మొదలైంది. ఇక పవర్ స్టార్ సినిమాలో పాట పడటం ఇదే మొదటిసారి కాదు. అత్తారింటికి దారేది సినిమాలో కాటమ రాయుడా..కదిరీ నర్సింహుడా పాటను పడ్డారు. అంతే కాకుండా అజ్ఞాతవాసి సినిమాలో కొడకా కోటేశ్వరరావు అనే పాటను పాడారు. ఈ రెండు పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

More Related Stories