పవన్ కళ్యాణ్ కూడా వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడొచ్Pawan Kalyan
2020-03-27 19:57:44

ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి ప్రమాదకరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సామాన్యులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు తమ తమ రంగాలతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తమకు చేతనైన సహాయాన్ని అందిస్తున్నారు. ముందుగా అందరిలోనూ నితిన్ తన వంతుగా పది లక్షలు సిఎం కేసీఆర్ కి అంద చేయగా ఆయన తరువాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల సీఎం సహాయ నిధులకు, ప్రధానమంత్రి సహాయనిధికి భారీ విరాళం ప్రకటించారు. తెలంగాణ, ఏపీ సీఎం సహాయ నిధులకు 50 లక్షల చొప్పున కోటి రూపాయల విరాళం అందిస్తానని చెప్పారు. అలాగే భారత ప్రధాన మంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం అందించనున్నట్లు పవన్ ట్విటర్ ద్వారా తెలిపారు. 

ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే కరోనా కారణంగా ఆగిపోయిన "వకీల్ సాబ్" పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించనున్నారట పవన్ కళ్యాణ్. అయితే లాక్ డౌన్ దృష్ట్యా ఆయన బయటకు రావడం కష్టం కాబట్టి ఆయన తన ఇంట్లోనే డబ్బింగ్ చెప్పనున్నారని అలా పవన్ కళ్యాణ్ కూడా వర్క్ ఫ్రమ్ చేయనున్నారన్నరన్న సంగతి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా పూర్తి అయ్యాక పవన్ క్రిష్ సినిమాలో నటించాల్సి ఉంది. ఆ సినిమా కూడా పూర్తయ్యాక ఆయన హరీష్ శంకర్ సినిమాలో నటించాల్సి ఉంది. ఇక వకీల్ సాబ్ సినిమాని వేణు శ్రీ రామ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని దిల్ రాజు బోణీ కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

More Related Stories