వకీల్ సాబ్ నెక్ట్ లెవెల్ సినిమా : దిల్ రాజు



Pawan Kalyan
2021-04-07 18:37:45

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాను నిర్మించి తన కల నెరవేర్చుకున్నారు దిల్ రాజు. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా చిత్ర విశేషాలను దిల్ రాజు వివరించారు. 

నాకున్న డ్రీమ్ ప్రకారం పవన్ గారితో వకీల్ సాబ్ సినిమా చేశాను. డ్రీమ్ ట్రూ అయ్యింది కాబట్టి నాలో ఇప్పుడున్నది తృప్తి, వకీల్ సాబ్ విజయం సాధిస్తే, ఆడియెన్స్ వావ్ అంటే అప్పుడు సంతోషం వస్తుంది..బ్యూటిఫుల్ జర్నీ ఇది. ఈ చిత్రాన్ని ఫాస్ట్ గా తీసి రిలీజ్ చేయాలని అనుకున్నాను. 2019 డిసెంబర్ లో మొదలు పెట్టాం. 2020 లో రిలీజ్ చేద్దామనుకున్నాం. లాక్ డౌన్ రావడం వల్ల పరిస్థితి మారిపోయింది. వన్ ఇయర్ హోల్డ్ చేసి అదే ఎనర్జీ మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇవాళ కూడా పవన్ గారిని కలిశాను. మా జర్నీ ఇంకో లెవెల్ కి పెరిగింది. 

కథను ఏమాత్రం డిస్ట్రబ్ చేయకుండా హీరో ఇమేజ్ కు తగినట్లు వకీల్ సాబ్ ఉంటుంది.  పవన్ గారిని అనుకున్నప్పుడే సాంగ్స్ ను, ఫైట్స్, ఆయన క్యారెక్టర్ ను డిజైన్ చేశాం. రేపు సినిమా చూశాక చాలా మంది తెలిసిన కథనే అయినా కొత్తగా ఉందని ఫీలవుతారు. ఎంజాయ్ చేస్తారు. ఒక ఆడియెన్ గా చెబుతున్నా, పింక్ 50, తమిళ్ చిత్రం 70 అయితే వకీల్ సాబ్ ను 100 మీటర్ లో పెట్టొచ్చు. 

సక్సెస్ ఫెయిల్యూర్ కామన్, కానీ ఒక సోల్ ఉన్న కథ మనల్ని ఎప్పుడూ డిజప్పాయింట్ చేయదు. కథ క్యారెక్టర్ లో చాలా విషయం ఉంది. కాబట్టి నా జస్టిమెంట్ ఫెయిల్ అవదు. ఏప్రిల్ 9న ఫస్ట్ షో పడగానే వకీల్ సాబ్ మరో లెవెల్ అని మీరే చెబుతారు. సండే రోజు ఆన్ లైన్ ఓపెన్ అయ్యాయి. ఎన్ని షోస్ ఓపెన్ చేస్తే అన్నీ బుకింగ్ అవుతున్నాయి. యూఎస్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే మాకే మతిపోతుంది. జనాలు కనెక్ట్ అయితే ఆగరు. 

More Related Stories