ఆయన సమాధి దర్శించుకున్న పవన్ కళ్యాణ్..Pawan Kalyan Haridwar.jpg
2019-10-12 15:39:29

పవన్ కళ్యాణ్ అందరిలాంటి రాజకీయ నాయకుడు కాదు. ఆయన సపరేట్ స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లిపోవడం పవన్ కళ్యాణ్ ప్రత్యేకత. అది తెలుగు రాష్ట్రాలు కానీ దేశం కానీ ఎక్కడైనా కూడా తనకు సమస్య ఉంది అనిపిస్తే మరో ఆలోచన లేకుండా ఆయన అక్కడికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు జనసేనాని. ఈయన ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ లో ఉన్నాడు. ఉన్నట్టుండి ఆధ్యాత్మిక పర్యటన కి వెళ్లాడు పవన్ కళ్యాణ్. హరిద్వార్‌లోని మాత్రి సదన్ ఆశ్రమానికి చేరుకొని.. అక్కడి ఆశ్రమ నిర్వాహకులు స్వామి శివానంద మహరాజ్‌ను కలుసుకున్నారు. మాత్రి సదన్ ఆశ్రమానికి వచ్చిన పవన్ కళ్యాణ్‌కు స్వామి స్థానిక సంప్రదాయ తలపాగా చుట్టారు. ఉత్తరాఖండ్‌లో జనసేనాని అక్కడి పద్ధతిలో తలపాగాతో చాలా ప్రశాంతంగా కనిపించరు. తలపాగాతో ఉన్న పవన్ కళ్యాణ్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయాయి. ఎక్కడికి వెళితే అక్కడ ఆ పద్ధతి ఫాలో అవుతున్న పవన్ కళ్యాణ్ ని చూసి అభిమానులు కూడా ఆనందంగా ఫీల్ అవుతున్నారు.

గంగానది ప్రక్షాళన కోసం ప్రాణత్యాగం చేసిన నిగమానంద స్వామీజీ సమాధిని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నాడు. గంగానదిలో ఆయనకు నివాళులు అర్పించారు ఈ జనసేనాని. పవిత్ర గంగా నదిని కలుషితం చేయడం అంటే మన సంస్కృతిని కలుషితం చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. గంగానదిని పవిత్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. దేశంలో ఉన్న పవిత్ర నదులను కాపాడుకోవడం పౌరులుగా మన బాధ్యత గుర్తు చేశాడు పవన్ కళ్యాణ్. ఆయనతో పాటు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరున్న రాజేంద్రసింగ్ ఇటీవల హైదరాబాద్‌లో పవన్‌ కళ్యాణ్ ని కలిసి అగర్వాల్ గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి రావాల్సిందిగా కోరారు.

వెన్నునొప్పి బాధ ఇంకా తగ్గనప్పటికీ అయన పిలుపు మేరకు హరిద్వార్ లో మాత్రి సదన్‌ ఆశ్రమం సందర్శించి అగర్వాల్ చిత్రపటానికి నివాళులు అర్పించారు పవన్. స్వామి శివానంద మహారాజ్ పవిత్ర గంగానదికి హారతిని ఇచ్చారు. మొత్తానికి ఇచ్చిన మాట కోసం వెళుతున్నప్పుడు కూడా లెక్కచేయకుండా హరిద్వార్ వెళ్లి అక్కడ పూజలు నిర్వహించి వచ్చాడు పవర్ స్టార్.

More Related Stories