హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రత్యక్షమైన పవన్ భార్య



 Pawan Kalyan
2020-12-17 15:18:38

రేణూదేశాయ్ తో విడాకులు తీసుకున్న తరవాత పవన్ కళ్యాణ్ రష్యన్ నటి అన్నా లేజీనోవాను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు మరియు ఓ కుమారుడు ఉన్నారు. అయితే కొద్ది రోజుకు క్రితం అన్నా తన పుట్టిల్లు రష్యాకు వెళ్ళింది. క్రిస్మస్ సెలెబ్రేషన్స్ కోసం ఆమె ప్రతి ఏడాది రష్యా వెళతారు. క్రిస్మస్ తరవాత మళ్ళీ తిరిగి ఇండియా కు వస్తారు. అయితే ఈ ఏడాది మాత్రం క్రిస్మస్ పండగ ఇంకా అవ్వకముందే అన్నా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అడుగుపెట్టింది. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇద్దరు పిల్లలతో కలిసి కనిపించింది. అయితే అన్నా గెటప్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. 

షార్ట్ హెయిర్ కట్ తో ఆమె కనిపిస్తుంది. అంతే కాకుండా చాలా బరువు పెరిగినట్టు కనిపిస్తుంది. ఇదిలా ఉండగా అన్నా విదేశాల్లో ఉండటంతో నిహరిక పెళ్ళికి హాజరు కాలేకపోయింది. దాంతో కొన్ని మీడియా సంస్థలు పవన్ మూడో భార్య పెళ్లికి హాజరు కాకపోవడం వెనకాల ఏదో ఉందంటూ కథనాలు రాసారు. అంతే కాకుండా మళ్ళీ పవన్ విడిపోతారా అంటూ కూడా రాసేశారు. మరోవైపు రేణు దేశాయ్ పెళ్లికి హాజరు కాకపోవడంపై కూడా అనుమానాలు మొదలయ్యాయి. ఈ విషయంపై రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు. తనకు పెళ్లికి ఇన్విటేషన్ అందిందని కానీ షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల పెళ్లికి హాజరవ్వలేకపోయానని సమాధానం ఇచ్చారు.

More Related Stories