మహేష్ ఫ్యామిలీకి స్పెషల్ గిఫ్ట్ పంపిన పవన్ దంపతులు



Pawan Kalyan
2020-12-24 12:29:42

క్రిస్మస్ పండగ సంధర్భంగా గిఫ్ట్ లు పంపుకోవడం ఒక ఆనవాయితీ. బందువులకు, స్నేహితులకు ఈ పండగ సంధర్భంగా గిఫ్టులు పంపి విషెష్ చెబుతారు. అయితే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ అతని భార్య అన్నా లెజినోవా...మహేష్ బాబు దంపతులకు క్రిస్మస్ గిఫ్ట్ పంపించారు. ఈ విషయాన్ని మహేష్ బాబు భార్య నమ్రత తన ఇన్స్టాగ్రామ్ లో పేర్కొంది. గిఫ్ట్ పంపిన పవన్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కాగా పవన్ కళ్యాణ్ తన తోటలో పండించిన మామిడి పళ్ళను ప్రతి ఏటా టాలీవుడ్ లో తన స్నేహితులకు పంపిస్తూ ఉంటారు. 

కానీ ఇలా పండగ సందర్భంగా గిఫ్ట్ ఇవ్వడం ఇదే మొదటిసారి. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు సినిమాలను బ్యాలెన్స్ చేస్తున్నారు. మహేష్ బాబు విషయానికొస్తే ఆయన అటు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూ యాడ్ షూట్స్ తో ఫుల్ గా సంపాదిస్తున్నారు. అంతేకాకుండా మహేష్ బాబు ప్రస్తుతం బిసినెస్ లోను రాణిస్తున్నారు.  ఇదిలా ఉండగా ఇద్దరు స్టార్ హీరోల మధ్య అనుబంధం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. హీరోలు ఎలా కలిసి ఉంటున్నారో వారి ఫ్యాన్స్ కూడా అలాగే కలిసి ఉంటూ ఒకరి హీరో సినిమాలకు మరో హీరో ఫ్యాన్స్ సపోర్ట్ చేయాలని నెటిజన్లు అంటున్నారు. 

More Related Stories