పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ Pawan Kalyan
2020-09-12 09:21:00

అసలు సినిమాలే చేయనని చాలా సార్లు చెప్పిన పవన్ ఇప్పుడు ఏకంగా వరుసగా మూడు నాలుగు సినిమాలు ఒప్పుకుని తన అభిమానులకే కాక సినీప్రియులకు కూడా షాకిచ్చారు. ఆయన రీఎంట్రీ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌ ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకోగా వేసవి కానుకగా మే 15న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే కరోనా దెబ్బకు ఆ ప్లాన్ అంతా అప్సెట్ అయింది. దాడాపుగా షూట్ చివరి దశకు చేరుకున్న సినిమాని విడుదల వాయిదా వేయక తప్పని పరిస్థితి.  ఈ క్రమంలో వకీల్ సాబ్ ను సంక్రాంతికి రిలీజ్ చేసే యోచన చేస్తున్నట్టు చెబుతున్నారు. 

ఇప్పటికే సంక్రాంతి రేసులో ఉన్న జక్కన భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌.ఆర్.‌ఆర్’‌తో పాటు చిరంజీవి నటిస్తోన్న ‘ఆచార్య’ మహేష్‌బాబు నటించనున్న ‘సర్కారు వారి పాట’, అల్లు అర్జున్‌ నటిస్తోన్న ‘పుష్ప’ లాంటి చిత్రాలు సంక్రాంతికి వచ్చే సూచనలు లేవు. అందుకే ‘వకీల్‌ సాబ్’‌ సంక్రాంతికి దించేందుకు దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ సినిమా షూట్ విషయం మీదే బోలెడు అనుమానాలు నెలకొని ఉన్నాయి. వ‌కీల్ సాబ్ సినిమాకి 20 రోజుల షూట్ పెండింగు ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ సెప్టెంబర్ చివరి వారంలో షూట్ మొదలు పెట్టే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే తర్వాత పవన్ జాయిన్ అయ్యాక షూట్ అంతటిని డిసెంబర్ ఎండింగ్ కి అంతా ముగించాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారని అంటున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

More Related Stories