పాయల్ సాహసం చేస్తోందాPayal Rajput
2019-09-17 14:51:13

ఆరెక్స్100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుబులు రేపిన పాయల్ రాజ్‌పుత్. ఆ తర్వాత సీత సినిమాలో ఓ ఐటం సాంగ్‌ తో కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ప్రస్తుతం వెంకీ మామ, డిస్కోరాజా సినిమాల్లో నటిస్తోన్న ఈ భామ ఆర్‌డీఎక్స్ లవ్ అనే సినిమాలో కూడా నటిస్తోంది. శంక‌ర్ భాను ద‌ర్శక‌త్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి ర‌ధ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు. హుషారు ఫేమ్ తేజు హీరోగా ఆరెక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా ‘ఆర్డీఎక్స్ లవ్’ సినిమా రూపుదిద్దుకుంది. సీకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, హ్యాపీ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సెప్టెంబ‌ర్‌లో ఈ సినిమా విడుద‌ల‌ చేస్తామని టీజర్ రిలీజ్ అప్పుడే హింట్ ఇచ్చారు మేకర్స్. 

అయితే తాజాగా ఈ సినిమాను అక్టోబ‌ర్ 11న విడుద‌ల చేస్తున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఈ మేరకు హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కూడా ట్విట్టర్ ద్వారా రిలీజ్ పోస్టర్లను పంచుకుంది. అయితే వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా’ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా విడుదలైన వారం రోజుల వ్యవధిలోనే ‘ఆర్డీఎక్స్ లవ్’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ ఒక్క సినిమా అనుకుంటే పొరపాటే రాజు గారి గది, చాణక్య అలాగే మరి కొన్ని సినిమాలు కూడా ఈ వారంలోనే రిలీజ్ కానున్నాయి. ఇన్ని సినిమాల మధ్య పాయల్ ఒక్కదాని కోసం ఈ సినిమా వైపు చూస్తారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ట్రేడ్ వర్గాల వారు.  

More Related Stories