విస్కీ గ్లాస్ తో పాయల్ రాజ్ పుత్..నెటిజన్లు ఫైర్Payal Rajput
2020-11-12 23:39:34

సినిమాల్లో మద్యం సేవించేటప్పుడు.. సిగరెట్లు తాగే సన్నివేశాలు వచ్చినప్పుడు కింద మద్యం సేవించడం..సిగరెట్లు తాగడం ఆరోగ్యానికి హానికరం అని వేస్తారు. ఎందుకంటే హీరోలను చూసి మిగితా వాళ్ళు తాగి జీవితాలు నాశనం చేసుకోకూడదని. సెన్సార్ కూడా దానికి మరో కారణం కావచ్చు. అయితే సినీతారలు మాత్రం ఎవరు ఎక్కడ పోతే మాకేంటి అన్నట్టుగా సోషల్ మీడియాలో వ్యవహరిస్తున్నారు. అటు బిల్లి తెర నటీనటుల నుండి సినిమా స్టార్ వరకు విస్కీని సోఅహల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. యాంకప్ రవి, హీరో నవదీప్, రానా లాంటివాళ్ళు సోషల్ మీడియాలో మెక్ డోనల్స్ విస్కీ  ని ప్రమోట్ చేస్తూ గ్లాసులు చేతిలో పట్టుకుని ఫోటోలు షేర్ చేసారు. ఇక ఆ మధ్య హీరోయిన్ పూజా హెడ్గే కూడా తన తండ్రితో కలిసి రెడ్ లేబుల్ విస్కీని ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. 

ఇప్పుడు తాజాగా ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ సైతం చేతిలో విస్కీ గ్లాసు పట్టుకుని ఫోటోలకు పోజులిచ్చింది. పాయల్ రాయల్ ఛాలెంజ్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ ఈ ఫోటోను పెట్టింది. దాంతో నెటిజన్లు పాయల్ పాప ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు. మీ సంపాదన కోసం ఇలా విస్కీని ప్రమోట్ చేయడం ఏంటని కడిగేస్తున్నారు. ఇక మరికొందరు కోట్లల్లో సంపాదించే హీరోలే ఎలాంటి యాడ్ పడితే అలాంటి యాడ్స్ లో నటిస్తున్నారు. పాయల్ ను ఎవరడిగారు అంటూ ఈ హాట్ బ్యూటీకి సపోర్ట్ చేస్తున్నారు.

More Related Stories