ప్రియుడితో పాయల్ రచ్చ..రచ్చpayal
2020-02-14 14:04:29

తెలుగులో ఒకే ఒక్క సినిమాతో రచ్చ రచ్చ చేసింది హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. RX 100 సినిమాలో తన గ్లామర్ తో యూత్ ను కట్టిపడేసింది ఈ బోల్డ్ బేబీ. RX 100 అంటే చాలు కార్తికేయ కంటే.. పాయల్ పేరే ముందుగా వినిపిస్తుంది. అందాల ఆరబోతలో అడ్డు చెప్పబోనని ఈ ముద్దుగుమ్మ.. RDX లవ్ తో మరోసారి ప్రూవ్ చేసింది.  ఆ తర్వాత  డిస్కో రాజా, వెంకీ మామ వంటి చిత్రాల్లో డీసెంట్ రోల్స్ చేసినా అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి.

అయితే రీల్ లైఫ్ లోనే అమ్మడి ఎఫైర్ అనుకుంటే.. రియల్ లైఫ్ లోనూ లవర్ తో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. ముంబై కి చెందిన సౌరభ్ డింగ్రా అనే మోడల్ తో పీకల్లోతు ప్రేమలో ఉంది పాయల్. ఇటీవల ఫిబ్రవరి 10 సౌరబ్ పుట్టిన రోజు సందర్భంగా అతనితో దిగిన ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. నీతో గడిపిన మధుర క్షణాలు మరువలేనివి.. నాలో ఉన్న లోపాలను కూడా ప్రేమించే ఏకైక వ్యక్తివి నువ్వే అంటూ తనపై ఎక్కడలేని ప్రేమను ఒలకబోసింది. ప్రస్తుతం అతనితో డేటింగ్ లో ఉన్న ఈ బ్యూటీ ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

More Related Stories