పాకెట్ మనీ కోసం ఆ పనులు చేసేదాన్ని..పాయల్ రాజ్ పుత్



 Payal Rajput
2020-11-16 13:51:10

ఆర్ఎక్స్100 సినిమాతో కుర్రకారు మతిపోగొట్టిన అందాల భామ పాయల్ రాజ్ పుత్. ఒక్క సినిమాతోనే పాయల్ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైపోయింది. సినిమాలో రొమాంటిక్ సీన్లలో పాయల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ కు తను తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేరన్నంత భాగా పాయల్ నటించేసింది. ఇక ఆర్ఎక్స్100 తరవాత తెలుగుతో పాటు హిందీ, తమిళ ఇండస్ట్రీలో పాయల్ బిజీ అయిపోయింది. వెంకీ మామ, డిస్కో రాజా, ఆర్డీఎక్స్ లవ్ లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాయల్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. కాలేజీ రోజుల్లో పాకెట్ మనీ కోసం తాను చాలా కష్టపడ్డానని పాయల్ తెలిపింది. తన కాలేజీలో ఫ్రెండ్స్ అందరూ చాలా రిచ్ అని...కానీ తమ తల్లి పాకెట్ మనీ కోసం నెలకి 2వేలు మాత్రమే ఇచ్చెదని తెలిపింది. దాంతో పాకెట్ మనీ కోసం యాకరింగ్ చేయడం ప్రారంభించినట్టు తెలిపింది. ఖర్చుల కోసం ఎన్నో షోస్ లో యాంకరింగ్ చేసానంటూ తెలిపింది. ఇక ఏ హీరోలతో నటించాలని ఉంది అని యాంకర్ పాయల్ ను ప్రశ్నించగా..తాను ఇప్పుడే కెరీర్ ను ప్రారంభించానని తప్పకుండా అందరూ హీరోలతో నటించాలని ఉందని పేర్కొంది.

More Related Stories