తెలుగు బిగ్ బాస్ 5 లోకి పాయల్ పాప Payal Rajput
2021-06-07 19:50:56

తెలుగు బిగ్ బాస్-4 కు వచ్చిన క్రేజ్ తో ఐదో సీజన్ ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఐదో సీజన్ మొదలవ్వాల్సింది కానీ కరోనా కారణంగా ఆడిషన్స్ ఆలస్యం అయ్యాయి. అయితే ప్రస్తుతం మేకర్స్ కంటెస్టెంట్ లను జూమ్ వీడియో కాల్ ద్వారాయా మాట్లాడుతూ సంప్రదింపులు జరుపుతున్నారట. అంతే కాకుండా ఇప్పటికే సోషల్ మీడియా స్టార్ షణ్ముక్ జశ్వంత్, టిక్ టాక్ స్టార్ దుర్గారావు సహా పలువురిని సెలెక్ట్ చేశారట. అయితే తాజాగా హాట్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సైతం బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తోందంటూ ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే పాయల్ రాజ్ పుత్ ను మేకర్స్ సంప్రదించడం కూడానా జరిగిపోయిందట. భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేయడం తో పాయల్ పాప కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇదిలా ఉండగా గత సీజన్ లో పాయల్ గెస్ట్ గా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సీజన్ లో ఏకంగా కంటెస్టెంట్ గా అలరించబోతుంది.

More Related Stories