పాయల్ కోరిక...ఎవరు తీరుస్తారో  Payal rajput
2020-06-24 13:03:34

ఆర్ ఎక్స్ 100 లాంటి బోల్డ్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బ్లాక్ బాస్టర్ కొట్టింది నటి పాయల్ రాజ్ పుత్. ఈమె నటించిన మొదటి సినిమానే బ్లాక్ బాస్టర్ కావడం ఆ సినిమాలో ఈమెది నెగటివ్ రోల్ అయినా ఆమె అందానికి, నటనకు ఫిదా అయిన అందరు మంత్ర ముగ్దులైపోయారు. దీంతో ఆమెకు టాప్ యంగ్ హీరోల నుచి కాక టాప్ సీనియర్ హీరోల నుండి వరసపెట్టి అవకాశాలు వస్తూ ఉండటం హాట్ టాపిక్ గా మారింది.  అయితే ఆమె కొన్ని ఒప్పుకుని చేతులు కూడా కాల్చుకుంది అందుకోండి అది వేరే విషయం. వెంకటేష్ వెంకీమామ, రవితేజ డిస్కోరాజా వంటి చిత్రాల్లో నటించినా ఆమె పాత్రలకి అయితే పెద్దగా గుర్తింపు రాలేదు. 

అయితే చిన్నప్పటి నుండి పాయల్ రాజ్‌పుత్‌కు అతిలోక సుందరి శ్రీదేవి అంటే చాలా ఇష్టమట. శ్రీదేవి బయోపిక్ లో ఆమె పాత్ర పోషించాలని ఆశగా ఉందని పాయల్ పాప చెబుతోంది. పాయల్ ప్రస్తుతానికి ప్రముఖ దర్శకుడు జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో వస్తోన్న నరేంద్ర సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో పాయల్ ఇండియన్ ఫస్ట్ ఫిమేల్ ఫైటర్ పైలెట్‌ గా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది. ఇక ఆ మధ్య ఏకంగా దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో ఆమె నటించే అవకాశమొచ్చినట్లు ప్రచారం జరుగింది. శంకర్ కమల్‌హాసన్‌ హీరోగా ‘ఇండియన్‌ 2’ చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్, రకుల్‌ ప్రీత్‌ సింగ్, సిద్ధార్థ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడీ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ కోసం పాయల్‌ ను సినిమా యూనిట్ సంప్రదించిందని అన్నారు. ఆ విషయం మీద క్లారిటీ అయితే లేదు.  

More Related Stories