భారతీయుడు 2 ప్రమాదం కేసు..ఆ వ్యక్తి అరెస్ట్‌case
2020-02-21 19:37:20

భారతీయుడు 2 షూటింగ్ క్రేన్‌ కూలిన ఘటనలో పోలీసులు చర్యలు ప్రారంభించారు. షూటింగ్‌ సమయంలో క్రేన్ ఆపరేట్ చేసిన రాజన్‌ను అరెస్ట్‌ చేశారు. నిర్లక్ష్యంగా క్రేన్‌ ఆపరేట్‌ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సినీ సాంకేతిక వర్గాల సమాచారం ప్రకారం టన్నుల బరువు ఉన్న క్రేన్ వాడే సమయంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు సినీ బృందం తీసుకోలేదని, అందుకే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. అందుకే నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారని అంటున్నారు. ఇప్పటికే నిర్మాతలు, క్రేన్‌ యజమాని, ఆపరేటర్‌, ప్రొడక్షన్‌ మేనేజర్‌పై కేసులు నమోదు చేసిన పోలీసులు నటుడు కమల్‌హాసన్‌, దర్శకుడు శంకర్‌కు సమన్లు జారీ చేశారని అంటున్నారు. ఈ పరిస్థితి ముందుగానే ఊహించిన కమల్ చనిపోయిన వారి కుటుంబాలకు ఏకంగా కోటి రూపాయిలు చెల్లించి ఇబ్బంది కలగకుండా చూసుకున్నాడని అంటున్నారు.

More Related Stories