యాంక‌ర్ శ్యామ‌ల‌కు షాక్..ఆమె భ‌ర్త న‌ర్సింహులు పై చీటింగ్ కేసు



Anchor Shyamala
2021-04-27 14:34:35

యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డి పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు న‌మోదైంది. కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడంటూ ఓ మ‌హిళ‌ ఫిర్యాదు చేసింది. 2017 నుండి ఇప్పటి వరకు విడతల వారిగా డబ్బు తీసుకునట్లు మ‌హిళ ఫిర్యాదులో పేర్కొంది. డబ్బుల విషయం అడిగితే శ్యామల భర్త నర్సింహారెడ్డి బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు ఫిర్యాదులో పేర్కొంది. డబ్బులు తీసుకోవడమే కాకుండా సెక్సువల్ అభ్యుస్ కు సైతం పాల్పడినట్లు బాధితురాలి ఫిర్యాదు చేసింది.

సెటిల్ మెంట్ చేసుకోవాలంటూ ఈ కేసులో నర్సింహారెడ్డి తరపున ఓ మ‌హిళ రాయ‌బారం నడుపుతున్న‌ట్టు తెలుస్తోంది. మ‌హిళ ఫిర్యాదు మేర‌కు కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు...నర్సింహారెడ్డి తో పాటు రాయబారం నడిపిన మహిళను రిమాండ్ కి తరలించారు. ఇదిలా ఉండ‌గా యాంక‌ర్ శ్యామ‌ల న‌ర్సింహారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే పెద్ద‌లు మొద‌ట కాద‌న్నా ఆ త‌ర‌వాత వీరి ప్రేమ‌ను అంగీక‌రించిన‌ట్టు తెలుస్తోంది. ఇక న‌ర్సింహారెడ్డి కూడా కొన్ని సీరియ‌ల్స్ లో న‌టించారు. వీరిద్ద‌రికి కూడా ఓ సీరియ‌ల్ షూటింగ్ స‌మ‌యంలోనే ప‌రిచ‌యం ఏర్ప‌డింది. 

More Related Stories