హీరో రాజ‌శేఖ‌ర్ కి షాకివ్వనున్న పోలీసులుRajasekar.jpg
2019-11-30 16:50:55

హీరో రాజ‌శేఖ‌ర్ ర్యాష్ డ్రైవింగ్ మరో సారి వార్తల్లోకి వచ్చింది. తాజాగా ఆయన డ్రైవింగ్ లైసెన్స్ ర‌ద్దు చేయాల‌నే ప్ర‌తిపాద‌న ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుండి వ‌చ్చిన‌ట్టుగా తెలుస్తుంది. ఇటీవ‌ల జ‌రిగిన ఓఆర్ఆర్ రోడ్డు ప్ర‌మాద ఘ‌ట‌న నేప‌థ్యంలో పోలీసులు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మాచారం. తరచూ ప్రమాదాలకి కారణం అవుతున్న రాజ‌శేఖ‌ర్ లైసెన్స్ ర‌ద్దు చేయాల‌ని సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇప్ప‌టికే ఆర్టీఏకి లేఖ కూడా రాశార‌ట‌.

ఈ నేపధ్యంలూ మ‌రి కొద్ది రోజుల‌లోనే ఆయ‌న లైసెన్స్ ర‌ద్దు కానుందని అంటున్నారు. నిజానికి రెండేళ్ళ క్రితం రాజశేఖర్ కారు ఓఆర్ఆర్ మీద ప్ర‌మాదానికి గురయ్యింది. ఆ రోజు రాత్రి పీవి ఎక్స్ ప్రెస్ హైవే మీద రామిరెడ్డి అనే వ్యక్తి కారుని తన కారుతో ఢీకొట్టారు. ఆల్కహాలు తీసుకొని డ్రైవింగ్ చేయడం వలనే అని భాదితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే త‌ల్లి చనిపోయింద‌నే డిప్రెష‌న్‌లో నిద్ర‌మాత్ర‌లు వేసుకోవ‌డం వ‌ల‌న ఆ మ‌త్తులో కారు యాక్సిడెంట్ చేశాడ‌ని తేలింది.

అక్కడితో ఆగక ఈ మధ్యే మరో ప్రమాదం జరిగి ఓఆర్ఆర్‌పై రాజ‌శేఖ‌ర్ నడుపుతున్న కారు మూడు ప‌ల్టీలు కొట్టింది. స‌మ‌యానికి బెలూన్స్ తెరుచుకోవ‌డంతో ఆయ‌న‌ పెద్ద ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డ్డారు. రాజ‌శేఖ‌ర్ కారు డివైడ‌ర్‌ని ఢీకొట్టి అవ‌తలి వైపుకి ప‌ల్టీలు కొట్టుకుంటూ వెళ్ల‌గా, ఆ స‌మ‌యంలో అటు నుండి ఎలాంటి వాహ‌నాలు లేక‌పోవ‌డంతో పెద్ద ప్ర‌మాదమే త‌ప్పింది.

కానీ అత్యంత రద్దీగా ఉండే ఓఆర్ఆర్ మీద రెండు మార్లు ఇలా యాక్సిడెంట్ చేయడంతో సీరియ‌స్‌గా తీసుకున్న పోలీసులు రాజ‌శేఖ‌ర్ డ్రైవింగ్ లైసెన్స్ ర‌ద్దు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తుంది. దీని మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

More Related Stories