పరారీలో బండ్ల గణేష్, గాలిస్తున్న పోలీసులు bandla ganesh
2019-10-05 09:51:08

నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్‌ మీద జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదయింది. వైసీపీ నేత, విజయవాడ పార్లమెంట్ కి పోటీ చేసి ఓడిపోయినా సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ)ను బండ్ల గణేష్‌ తన అనుచరులతో కలిసి గతరాత్రి బెదిరింపులకు పాల్పడ్డాడని సమాచారం. అసలేమైందంటే జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘టెంపర్‌’  చిత్రానికి బండ్ల గణేష్‌ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఆ సినిమాకి అప్పట్లో పీవీపీ రూ.7 కోట్లు ఫైనాన్స్‌ చేశారు. గత కొంతకాలంగా తనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని పీవీపీ గట్టిగానే అడుగుతున్నారు. 

ఈ నేపథ్యంలో నిన్న అర్థరాత్రి దాటాక కొంతమంది అనుచరులతో కలసి వెళ్లి పీవీపీ నివాసంపై బండ్ల గణేష్‌ బెదిరింపులకు పాల్పడటమే కాక వాటి కుటుంబ సభ్యుల మీద దౌర్జన్యానికి పాల్పడ్డారని  జూబ్లీహిల్స్ పీఎస్ లో పీవిపీ పిర్యాదు చేశారు. పీవీపీ ఫిర్యాదు చేయడంతో 448, 506, రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద బండ్ల గణేష్‌తో పాటు నలుగురిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బండ్ల గణేష్‌ అజ్ఞాతంలో ఉన్నాడు. బండ్లగణేష్ సహా మరో నలుగురిపై కేసులు నమోదయినట్టు పోలీసులు చెబుతున్నారు. ఆయన బయటకు వస్తే గానీ ఈ విషయంలో అడలు నిజానిజాలు బయటకు రావు.  

More Related Stories