అబ్బే ఆ అవకాశం చేజారిపోయింది అంటున్న పూజాPooja Hegde
2020-04-02 20:48:14

తెలుగులో పూజా హెగ్డే ఇప్పుడు వరుస అవకాశాలతో స్టార్ హీరోల పక్కన నటిస్తూ హీరోయిన్ హోదా అనుభవిస్తోంది. ఒక్క టాలీవుడ్‌ కే ఆగిపోకుండా మరో పక్క బాలీవుడ్‌ లో కూడా స్టార్‌ హీరోలతో కూడా ఆడిపాడుతోంది ఈ కన్నడ భామ. అయితే ఆ మధ్య  ఈ భామ ఓ క్రేజీ ఆఫర్‌ కొట్టేసినట్లు ప్రచారం జరిగింది. అది కూడా ఏకంగా ఎనిమిదేళ్ళ తర్వాత తమిళ్‌ లో సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. నిజానికి 2012లో వచ్చిన తమిళ సినిమా ‘ముగమూడి’తో సినిమాలకి పరిచయం అయిన ఈ భామ..ఆ తర్వాత తమిళ్‌ లో ఒక్క సినిమా కూడా చేయలేదు. అక్కడి నుండి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇక్కడ సెటిల్ అయింది. ఇక్కడకొచ్చాక నెక్స్ట్ ఆప్షన్ బాలీవుడ్ కావడంతో అక్కడికి కూడా వెళ్లి సినిమాలు చేసి మంచి పేరు సంపాదించింది. అయితే ఆమెకు ఇన్నేళ్ల తర్వాత తమిళ స్టార్‌ హీరో సూర్యతో జోడీ కట్టే ఛాన్స్‌ వచ్చినట్టు కోలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సూర్య హీరోగా ‘సింగం’ సిరీస్‌ చిత్రాల దర్శకుడు హరి ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. 

అరువా(కత్తి) అనే టైటిల్‌ ఖరారు చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో నాయికగా పూజా హెగ్డేని ఎంపిక చేయబోతున్నారని టాక్‌ వినిపిస్తోంది. అయితే అలాంటిడి ఏమీ లేదంటూ పూజా ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. అప్పుడే నేను తమిళ సినిమా చేస్తున్నాననే నిర్ణయానికి రావద్దుని ఇప్పటి వరకు ఏ తమిళ ప్రాజెక్ట్‌కు నేను సంతకం చేయలేదని చెప్పుకొచ్చింది. అన్ని సక్రమంగా జరిగితే నేను ఈ సంవత్సరం ఖచ్చితంగా ఒక తమిళ చిత్రం చేయాలని అనుకున్నా కానీ అది చేజారిపోయిందని పూజా తెలిపింది. ఇక స్టూడియో గ్రీన్‌ పతాకంపై నిర్మితమవుతున్న సూర్య అరువా సినిమాకి డి.ఇమాన్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో ‘ప్రభాస్‌ 20’, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో నటిస్తోంది పూజా. అంతకు ముందు విజయ్ సరసన నటించనుందని కూడా టాక్ వచ్చింది. 

More Related Stories