ప్రేమలో పడిన పూజాహెగ్డే.. సీనియర్ హీరో కొడుకుతో..pooja
2020-02-11 14:36:13

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న టాప్ హీరోయిన్స్ లో పూజా హెగ్డే ముందు వరుసలో ఉంటుంది. వరుస విజయాలకు తోడు స్టార్ హీరోలు కూడా పిలిచి అవకాశం ఇస్తుండటంతో ఈ ముద్దుగుమ్మ నెంబర్ వన్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీలో చక్రం తిప్పుతుంది. ఈమధ్య విడుదలైన అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాతో పూజా హెగ్డే రేంజ్ మరింత పెరిగిపోయింది. ఓ విధంగా చెప్పాలంటే కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. మహేష్ బాబుతో నటించిన మహర్షి సినిమా హిట్ అనిపించుకుంది కానీ బ్లాక్ బస్టర్ మాత్రం కాదు. దానికి ముందు అరవింద సమేత, డీజే సినిమాలు కూడా అంతే. దాంతో వరుసగా అవకాశాలు అందుకుంటున్న కూడా ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ లేని లోటు మాత్రం అలాగే ఉండిపోయింది. అలాంటి సమయంలో వచ్చిన అల వైకుంఠపురంలో పూజా హెగ్డే ఆకలి మొత్తం తీర్చేసింది. ఈ సినిమా తర్వాత మరిన్ని అవకాశాలు ఈ ముద్దుగుమ్మ ముంగిట నిలిచాయి. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న ఒక సినిమా.. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాల్లో నటిస్తోంది ఈ భామ.

వీటితోపాటు మరో రెండు మూడు సినిమాలు కూడా పూజ హెగ్డే ఖాతాలో ఉన్నాయి. ఇంత బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ గురించి తాజాగా ఒక వార్త ఇండస్ట్రీలో బాగా చక్కర్లు కొడుతుంది. ఊపిరి పీల్చుకోవడానికి కూడా తీరిక లేనంత బిజీగా ఉన్న పూజా హెగ్డే ప్రేమలో ఉంది అనే వార్త వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో కుమారుడితో ఈమె ప్రేమలో ఉంది అంటూ కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. సీనియర్ హీరో వినోద్ మెహ్రా కుమారుడు రోహాన్ తో పూజా హెగ్డే ప్రేమలో పడిందనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతుంది. గతేడాది విడుదలైన బజార్ సినిమాతో ఈయన పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం ఈ కుర్రహీరోతో పూజా హెగ్డే డేటింగ్ లో ఉందనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. తమపై వార్తలు వస్తున్న కూడా ఎవరి పని వాళ్లు చేసుకుంటున్నారు. అంటే దాని అర్థం తమ మధ్య రిలేషన్ ఉందని ఒప్పుకుంటున్నారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. మరి దీనిపై ఇద్దరూ ఏమంటారో చూడాలి.

More Related Stories