బాలీవుడ్‌లోనూ భారీగా తీసుకుంటున్న పూజాpooja
2020-03-20 07:28:59

తెలుగులో "ముకుంద'' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ఇటు టాలీవుడ్‌లో వరుస సినిమాల్లో అవకాశాలు దక్కుతుండడంతో పాటుగా బాలీవుడ్‌లోను ఈ భామను వెతుక్కుంటూ ఆఫర్లు వస్తున్నాయి. పూజా నటించిన "మహర్షి, అరవింద సమేత'' సినిమాలు బ్లాక్‌ బస్టర్‌లు కాకపోయినా పూజా క్రేజ్‌ మాత్రం టాలీవుడ్‌లో తగ్గలేదు. రీసెంట్ గా విడుదలైన "అల వైకుంఠ పురం'' సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో ఈ భామ టాలీవుడ్‌లోచక్రం తిప్పుతోంది. ఇప్పటికే తెలుగులో పలు క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటించే చాన్స్‌ కొట్టేసింది. ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి "జాన్‌'' సినిమాలో పూజా నటిస్తుండగా రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా తరువాత రాబోయే అఖిల్ సినిమాలోను నటించేందుకు పూజా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.  


ఇదిలా ఉండగా ఇప్పటికే బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌ సరసన హౌస్‌ఫుల్‌-4 సినిమాలో నటించిన పూజా ఇప్పుడు మరో బాలీవుడ్‌ సినిమా "కబి ఈద్‌ కబి దివాలి'' సినిమాలో నటిస్తోంది. తెలుగులో రెండు కోట్ల వరకు రెమ్మునేషన్‌ తీసుకుంటున్న ఈ సుందరి సల్మాన్‌ సినిమాలో నటించేందుకు ఏకంగా నాలుగు కోట్ల పారితోషికం పుచ్చుకుంటోందట. ఇక హౌస్‌ఫుల్‌-4 విజయంతోనే పూజా నాలుగు కోట్లు అడిగినా ప్రొడ్యూసర్లు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. సాజిత్‌ నడియడ్వాల నిర్మిస్తున్న ఈ సినిమాకు ఫర్హాద సంజీ దర్శకత్వం వహిస్తున్నారు.

 

More Related Stories