సల్మాన్ ఖాన్‌కు షాకిచ్చిన పూజా హెగ్డే..  Pooja Hegde
2020-03-19 11:15:55

పూజా హెగ్డే ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ సినిమాలు కూడా చేస్తుంది. అన్నిచోట్లా స్టార్ హీరోలతోనే నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. కొన్నేళ్లుగా వరస విజయాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు కూడా ఇదే చేయాలని చూస్తుంది. పెరుగుతున్న ఇమేజ్ తో పాటే రెమ్యునరేషన్ కూడా పెంచేస్తుంది పూజా. ఇప్పటికే సినిమా సినిమాకు తన రేట్ పెంచుకుంటూ వెళ్తున్న పూజా ఇప్పుడు టాప్ లో వచ్చి బ్రేకులు వేసింది.

ప్రస్తుతం తెలుగులో ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ ఓ డియర్ సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రం కోసం 2 కోట్లకు పైగానే తీసుకుంటుందని ప్రచారం అయితే జోరుగానే జరుగుతుంది. ఇక అఖిల్ అక్కినేనితో నటించడానికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా కోసం దాదాపు 2.25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది. ఈ రెండు సినిమాలు ఇలా ఉండగానే సల్మాన్ ఖాన్ తో సాజిద్ నడియావాలా నిర్మాణంలో ఓ సినిమా చేస్తుంది పూజా. ఈ చిత్రం కోసం ఏకంగా 4 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. 

మొదట్లో కాస్త తటపటాయించినా కూడా పూజా రేంజ్ తెలిసి నిర్మాత సాజిద్ అంతా ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. తెలుగులో ప్రస్తుతం ఈమె ఏ సినిమాలోనూ నటించడం లేదు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఈమె తెలుగు ఇండస్ట్రీకి దూరం అయిపోయినట్లే అనిపిస్తుంది. ఇంత రేట్ ఇక్కడ నిర్మాతలు భరించడం కష్టమే. అల వైకుంఠపురములో తర్వాత పూజా రేంజ్ మరింతగా పెరిగిపోయింది. 

More Related Stories