పూజా హెగ్డేకు కరోనా పాజిటివ్



Pooja Hegde
2021-04-26 12:24:35

పూజా హెగ్డేకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని  పూజా హెగ్డే స్వయంగా ప్రకటించారు. ఈ క్రమంలో బుట్టబొమ్మ పూజా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అందరికీ హలో.. నాకు కరోనా పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని అందరికీ  తెలియ చేస్తున్నాను.  నియమ నిబంధనలు పాటిస్తు నాకు నేనుగా స్వీయ నిర్భందంలోకి వెళ్లాను. సెల్ఫ్ క్వారంటైన్ అయ్యాను అని చెప్పుకొచ్చారు.గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారంతా కూడా పరీక్షలు చేసుకోవాలని కోరుతున్నాను. మీరు చూపించిన ప్రేమ, ఇస్తోన్న మద్దతుకు చాలా థ్యాంక్స్. అందరూ ఇంట్లోనే ఉండండి.. సురక్షితంగా ఉండండి అని పూజా హెగ్డే కోరారు. పూజా హెగ్డే ప్రస్తుతం ఆచార్య, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్, రాధేశ్యామ్ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

More Related Stories