వకీల్ సాబ్ కు పూనమ్ కౌర్ సపోర్ట్



Poonam Kaur
2021-04-10 11:28:26

టాలీవుడ్ బ్యూటీ పూనమ్ కౌర్ చేసింది వేళ్ల పై లెక్కపెట్టే సినిమాలే అయినా పవన్ కళ్యాణ్ ఇష్యు తో తెగ పాపులర్ అయ్యింది. అప్పట్లో ఇన్ డైరెక్ట్ గా పవన్ పై పూనమ్ విమర్శలు కురిపించేది. అంతే కాకుండా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పై కూడా పూనమ్ ఆరోపణలు చేసింది. అయితే మధ్యలో తనతో రామ్ గోపాల్ వర్మ అలా మాట్లాడించారని...ఒక గంటసేపు ఆర్జివి తనకు బ్రేన్ వాష్ చేసారని తెలిపింది. అంతే కాకుండా రామ్ గోపాల్ వర్మ ఆడవాళ్ళ వీక్ నెస్ తెలుసుకుని బ్లాక్ మెయిల్ చేస్తూ ఇలా మాట్లాడిస్తారని సంచలన ఆరోపణలు చేసింది. ఇక ఆ తరవాత నుండి పూనమ్ పవన్ కు సపోర్ట్ గానే మాట్లాడుతుంది. 

అంతే కాకుండా పవన్ కళ్యాణ్ పై జరిగే నెగిటివ్ ప్రచారాన్ని కూడా తిప్పి కొట్టిన సందర్భాలున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా శుక్రవారం విడుదలైన వకీల్ సాబ్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది మాత్రం వాకీల్ సాబ్ పై నెగిటివ్ ప్రచారం మొదలు పెట్టారు. డిజాస్టార్ వకీల్ సాబ్ అంటూ ట్రెండింగ్ లోకి తీసుకువచ్చారు. ఇక ఈ ప్రచారం పై పూనమ్ స్పందించింది. మంచి సినిమాలకు సపోర్ట్ చేయాలని పేర్కొంది. సినిమాలపై కుళ్లు రాజకీయాలు మానుకోవాలని సూచించింది. కొంతమంది సినిమాను తక్కువ చేసి ట్రెండ్ చేయడం వెనక అర్థం ఏముందో అని వ్యాఖ్యానించింది. అమ్మాయిలను. తక్కువ చేసి రాజకీయం చేస్తే తప్పు..కానీ అమ్మాయిలను రక్షించే సినిమా తీస్తే ఎవరికి ప్రాబ్లమ్ వచ్చిందంటూ ప్రశ్నించింది.

More Related Stories