పవన్ మీద పావలా కామెంట్స్...ఆ హీరోయిన్ కి పూనమ్ కౌర్ మద్దతుkour
2019-09-03 20:39:27

 నిన్న జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును ఆయన ఘనంగా జరుపుకోకపోయినా ఆయన అభిమానులు మాత్రం ఘనంగా జరుపుకున్నారు. ఏకంగా కోటి ట్వీట్స్ చేసి ఆయన బర్త్ డేని ట్రెండింగ్ లో ఉంచారు. అయితే ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఆయన హేటర్స్ కూడా వేరే హ్యాష్ ట్యాగ్ లను వైరల్ చేశారు. అందులో భాగంగా హ్యాపీ బర్త్ డే పావలా కళ్యాణ్ అనే హ్యాష్ ట్యాగ్ ని కూడా వైరల్ చేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తో గతంలో ఎస్ జె సూర్య దర్శకత్వంలో 'కొమరం పులి' సినిమాలో హీరోయిన్ గా నటించిన నికీషా పటేల్ పవన్ కి బర్త్ డే విషెష్ తెలుపుతూ పొరపాటున పవన్ కళ్యాణ్ కి బదులుగా పావల కళ్యాణ్ అని హ్యాష్ ట్యాగ్ జత చేసింది. ఆమె పొరపాటునే చేసినా పవన్ అభిమానులు మాత్రం ఆ హీరోయిన్ పై రెచ్చిపోయారు. ఆమె కావాలనే చేసిందనే కోపంతో ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు.

కాసేపటికే ఇది వెబ్ మీడియాలో కూడా హైలైట్ అయింది. దీంతో తన పొరపాటు తెలుసుకున్న నికీషా పొరపాటున ఆ హ్యాష్ ట్యాగ్ జత చేశానని, కొంతమంది ఇడియట్స్ ఆ హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేయడం వల్లే పొరపాటు జరిగిందని చెబుతూ ఆ ట్వీట్ తొలగించి సరైన ట్యాగ్ స్ తో మళ్ళీ ట్వీట్ చేసింది. ఇక తాజాగా ఈ వివాదంపై హీరోయిన్ పూనమ్ కౌర్ నికీషా పటేల్ కు మద్దత్తు తెలిపింది.స్ నికిషా.. నువ్వు ఎవరికీ జవాబుదారీవి కావు. వివరణలు ఇవ్వడం మానేయ్. లేదంటే నిన్ను ట్రోల్ చేస్తూనే ఉంటారు. గతంలో నువ్వు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నీ వ్యాఖ్యలను వక్రీకరించిన ఆ చెత్త జర్నలిస్ట్ గుర్తున్నాడు కదా. దానివల్ల నీ కెరీర్ పైనే ప్రభావం పడింది. ప్రశాంతంగా ఉండు ఎంజాయ్ చేయ్. నువ్వు నిజం కోసమే నిలబడతావ్. ఐ లవ్ యూ. నీకు దేవుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నా' అంటూ పూనమ్ ట్విట్ చేసి నికీషాకు అండగా నిలిచింది. కత్తి మహేష్ వ్యాఖ్యలతో పూనం కౌర్ వివాదం రేగిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఈ విషయంలో పవన్ అభిమానులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

 

More Related Stories