పవన్ ప్రకాష్ రాజ్ ఇష్యూ..నేను బలయ్యా అంటున్న పూనమ్ కౌర్ Poonam Kaur
2020-12-09 19:26:39

అప్పట్లో పవన్ కల్యాణ్-పూనమ్ కౌర్ ప్రస్తావన వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు మొదలయ్యిందో..ఎక్కడ మొదలయ్యిందో తెలియదు కానీ అప్పటినుండి కొన్ని రోజులు కొనసాగుతూనే ఉంది. మరోవైపు కొంతకాలం క్రితం ఆర్జీవి మాటలను వినే పవన్ పై కామెంట్స్ చేసానంటూ పూనమ్ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా పవన్ ను పొగడటం కూడా మొదలు పెట్టింది. ఇక తాజాగా మరోసారి పవన్ మ్యాటర్ లో పూనమ్ ఎంటర్ అయింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ధోరనిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 

ఈ వ్యాఖ్యలు మీడియాలో మోత మోగిపోయాయి. ఇక తాజాగా ప్రకాష్ రాజ్ రైతులకు సపోర్ట్ గా ఓ ట్వీట్ చేశారు. కానీ మీడియా పట్టించుకోలేదు. ఈ విషయం పైనే పూనమ్ సోషల్ మీడియాలో స్పందించింది. ఓ పొలిటీషియన్, ఫేమస్ హీరోపై ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేస్తే మీడియా వైరల్ చేసింది. కానీ ప్రకాష్ రాజ్ రైతులపై ఓ ట్వీట్ చేస్తే మాత్రం మీడియా పట్టించుకోలేదు" అంటూ పూనమ్ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ కు పూనమ్ రీప్లే ఇచ్చారు. మీడియా వల్ల ఎజెండా వేరు..వాళ్ళ ఎజెండాలు వాళ్లకు ఉంటాయి. అంటూ కామెంట్ చేసాడు. ఇక ప్రకాష్ రాజ్ కామెంట్ కు మళ్ళీ రీప్లే ఇచ్చిన పూనమ్ "అవును సార్ అలాంటి ఎజెండాల వల్లనే నేను బలయ్యను" అంటూ చెప్పుకొచ్చింది.

More Related Stories