ఎన్టీఆర్, వైఎస్ఆర్ పై పూనమ్ కౌర్ సంచలన ట్వీట్Poonam Kaur
2021-02-03 18:04:14

పవన్ కళ్యాణ్ వీరాభిమాని పూనమ్ కౌర్ తాజాగా చేసిన ట్వీట్స్ సంచలనం గా మారాయి. పూనమ్ దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ఆర్ లను కొని యాడుతూ మిస్ యూ ఫార్మర్స్ అని పోస్ట్ పెట్టారు. వైఎస్ఆర్, ఎన్టీఆర్ లు మూర్తిభవించిన నాయకులని ఆమె పేర్కొన్నారు. అంతే కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే తనకు గౌరవమని అన్నారు. మరోవైపు యూపీ ముఖ్యమంత్రి యోగి, అరవింద్ కేజ్రీవాల్, కెప్టెన్ అమరిందర్ సింగ్, మన్మోహన్ సింగ్, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లను టాగ్ చేస్తూ మరో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో పూనమ్ రైతులకు అండగా నిలబడాలని కోరారు.  రాజకీయ ఉద్దేశాలు,కారణాలు పక్కన పెట్టి రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. 

పూనమ్ సొంత రాష్ట్రం పంజాబ్ కాగా ఈ అమ్మడు హైదరాబాద్ లో పెరిగింది. అయితే ప్రస్తుతం రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతుల్లో ఎక్కువశాతం పంజాబ్ కు చెందిన వారే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మాతృ రాష్ట్రం పై ఉన్న మమకారం తో పూనమ్ ఏ పోస్ట్ చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా తనకు ఎంతో ఇష్టమైన పవన్ కళ్యాణ్ పేరును మాత్రం పూనమ్ తన ట్వీట్ లో ప్రస్తావించకపోవడం విడ్డూరం.

More Related Stories