టీవీ9 నుండి సత్తి ఔట్...అందుకే తొలగించారా  Bithiri Sathi
2020-06-25 13:18:39

ఒకప్పుడు వీ6 ఛానెల్ అనగానే మ‌న‌కు గుర్తుకు వ‌చ్చే బిత్తిరి స‌త్తి ఇప్పుడు టీవీ9లో చేరిపోయాడు. నిజానికి ఆయన అసలు పేరు రవి అనే విషయం కూడా చాలా మందికి తేలేదు. ఆయన సత్తి పేరుతోనే అంత ఫేమస్ అయిపోయాడు. అంతకు ముందు అడపాదడపా కొన్ని టీవీ చానెల్స్ ప్రోగ్రామ్స్ లో ఆయన మెరిసినా ఆయనకు ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టింది సత్తి క్యారెక్టర్. త‌న‌దైన శైలిలో తెలంగాణా యాస‌లో మాట్లాడుతూ అంద‌రినీ ఆక‌ట్టుకున్న బిత్తిరి స‌త్తి వల్లే వీ6కు టీఆర్పీ రేటింగ్‌లు కూడా పెరిగాయంటే అతిశయోక్తి కాదు. అయితే అనూహ్యంగా వీ6 చాన‌ల్‌కు గుడ్‌బై చెప్పి టీవీ9లో చేరిన స‌త్తిని టీవీ9 తొలగించినట్టు వార్తలు వస్తున్నాయి.  

అయితే దీనికి ముఖ్య కారణం రెండు రోజుల క్రితం జరిగిన ఇస్మార్ట్ న్యూస్ షోలో తన వ్యక్తిగత జీవితంకి సంబంధించిన కొన్ని విషయాలని బిత్తిరి సత్తి ప్రస్తావించినట్లు చెబుతున్నారు. అదీ కాక ఈయనను లక్షలు పెట్టి హైర్ చేస్తే ఈయన కంటే ఎక్కువ పేరు ఆర్జే సూర్య సంపాదించాడని, సత్తి స్కిట్స్ కంటే కొండబాబు పేరుతో సూర్య చేసే వాటికే వ్యూయర్ షిప్ వస్తోందని భావిస్తున్నట్టు చెబ్తుహున్నారు. పైగా స్కిట్స్ విషయంలో సత్తి సొంత నిర్ణయాలు తీసుకోవడంపై పలుమార్లు యాజమాన్యం ఆయన్ని హెచ్చరించినప్పటికీ సత్తి పట్టించుకోకపోవడంతో తొలగించక తప్పలేదని అంటున్నారు. అయితే ఈయన బిగ్ బాస్ కి వేల్లనున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం ఎంత ఉందనేది తెలియాల్సి ఉంది. 

More Related Stories