బాలయ్య మాటలు వదిలేయండి అంటున్న పోసాని కృష్ణమురళి.. Balakrishna
2020-06-08 23:14:42

తెలుగుదేశం నేత, హీరో నందమూరి బాలకృష్ణ కోపం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడటం ఈయనకు తెలియదు. ముక్కుసూటిగా ఎవరిని టార్గెట్ చేయాలో వాళ్లను టార్గెట్ చేసి మాట్లాడుతుంటాడు బాలయ్య. కొన్నిసార్లు అది ఆయనకు చిక్కులు తీసుకొచ్చి పెడుతుంది కూడా. అయినా కూడా ఆయన పంథా మార్చుకోడు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి కూడా బాలయ్య గురించి ఇలాంటి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. సినీ రాజకీయ అంశాలపై ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎన్నో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. అందులో బాలకృష్ణ గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. బాలయ్య కోపం గురించి అందరికీ తెలుసు అని.. ఆయన కల్మషం లేని మనిషి అంటూ ప్రశంసించాడు. 

నిజంగా ఆయన తిట్టినా కూడా అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నాడు. బాలయ్య కోపం కేవలం నిమిషంలో అయిపోతుంది.. ఆ తర్వాత మళ్ళీ మామూలు మనిషి అయిపోతాడు అంటున్నాడు పోసాని. వైసీపీ ప్రభుత్వంపై ఈ మధ్య కొన్ని ఇంటర్వ్యూలలో సంచలన వ్యాఖ్యలు చేశాడు బాలకృష్ణ. ఐదేళ్లు జగన్ ప్రభుత్వం నిలబడదని.. ప్రజలు తాము చేసిన తప్పు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. దీనిపై పోసాని మాట్లాడుతూ బాలయ్యకు కోపం వస్తే సమాజానికి నష్టం లేదు.. ఆయన చాలా మంచి మనిషి.. ఎవరికీ నష్టం చేయడు అని చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో జరుగుతున్న మీటింగ్స్ విషయంలో కూడా బాలయ్యను పిలవకపోవడం తప్పు అంటున్నాడు పోసాని. అయితే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నా మనకు తెలియదు కాబట్టి స్పందించక పోవడం మంచిది అంటున్నాడు ఈయన.

More Related Stories