సెన్సేషనల్ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా  Prabhas
2020-06-05 10:43:52

బాహుబలి, బాహుబలి 2 వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తరువాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. అత్యంత క్రేజ్‌ ఉన్న పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ అంటే అతిశయోక్తి కాదేమో. జపాన్, చైనా లాంటి దేశాల్లో కూడా ఈ బాహుబలి సిరీస్ రిలీజ్ కావడంతో ప్రభాస్ ఇమేజ్ హాలివుడ్ స్థాయికి చేరింది. అయితే ఆ ఇమేజ్ ను క్యాష్ చేసుకోవడానికి సాహో సినిమాను ఇంటర్నేషనల్ రేంజ్ నిర్మాణ విలువలతో రూపొందించినప్పటికీ బాక్సాఫీసు వద్ద మాత్రం అది నిలవకేకపోయింది. 

అయితే ఇప్పుడు ఆయన జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో వింటేజ్ స్టైల్‌ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ అశ్వినీ దత్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 200 కోట్ల బడ్జెట్‌తో పాన్‌ ఇండియన్ మూవీగా తెరకెక్కుతోన్నది. ఇక ఈయనతో సినిమాలు చేసేందుకు బాలీవుడ్‌ దర్శక నిర్మాతలు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే ఇదిలా ఉంటే ప్రభాస్ తర్వాత సినిమా గురించి మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. 

అదేంటంటే కేజీఎఫ్ తో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. ప్రభాస్ కి ఇది 22వ సినిమా అవుతుందని అంటున్నారు. నిజానికి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌ తో సినిమా చేస్తున్నట్టు క్లారిటీ వచ్చేసింది. ఆ సినిమా పూర్తి అయిన తరువాత ప్రభాస్ తో నీల్ చేయబోయే చిత్రం పట్టాలెక్కనుందని అంటున్నారు. ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ సినిమాను నిర్మిస్తున్న డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో డీవీవీ దానయ్య నిర్మించనున్నట్టు సమాచారం. ఆయన ఇప్పటికే ప్రశాంత్ కు తిరిగి ఇవ్వలేని విధంగా అడ్వాన్స్ ఇచ్చారని అంటున్నారు. 

More Related Stories