కరోనా ఎఫెక్ట్..ప్రభాస్ ఆదిపురుష్ కు బ్రేక్



 Prabhas
2021-04-15 14:46:31

దేశం లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. దాంతో పలు రాష్ట్రాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర లో కరోనా విజృంభన ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మహా సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ అమలు చేయకుండా బ్రేక్ ది చైన్ పేరుతో ఎప్రిల్ 14 నుండి మే 1 సాయంత్రం వరకు కర్ఫ్యూ విదిస్తున్నట్టు తెలిపింది. 

అయితే ఈ ప్రభావం మళ్ళీ సినీ పరిశ్రమ పై కూడా పడింది. కర్ఫ్యూ విధించడం తో పాటు షూటింగ్ లకు సైతం ముంబై లో అనుమతులు నిరాకరించినట్టు తెలుస్తోంది. దాంతో పలు సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడింది. షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న "పఠాన్", సల్మాన్ ఖాన్ "టైగర్ 3", అంతే కాకుండా ప్రభాస్ హీరోగా నటిస్తున్న "ఆది పురుష్" సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. 

అంతే కాకుండా సినిమా తదుపరి షెడ్యూల్ ను ఆగస్టులో ప్రారంభించనున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ప్రభాస్ ఇప్పుడు "రాధే శ్యామ్" సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారట. ఇప్పటికే  రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పూర్తయినప్పటికి కొన్ని సీన్లను రీషూట్ చేస్తున్నట్టు సమాచారం. మరో 10 రోజుల వరకు ప్రభాస్ రాధే శ్యామ్ షూట్ లో పాల్గొంటారు.

More Related Stories