ప్రభాస్ ఆదిపురుష్ వచ్చేది అప్పుడేPrabhas
2020-11-19 18:47:51

బాహుబలి సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ల మీద సర్ప్రైజ్ లు ఇస్తున్నాడు. ఇటీవలే ప్రభాస్ "రాధే శ్యామ్" సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఇక తాజాగా ప్రభాస్ నటిస్తున్న మరో భారీ బడ్జెట్ సినిమా "ఆదిపురుష్" ను కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టకముందే చిత్ర యూనిట్ విడుదల తేదీని ప్రకటించింది. 2022 ఆగస్టు 11న సినిమాను విడుదల చ్చేస్తున్నట్టు ప్రకటించింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నారు. ప్రభాస్ కు విలన్ గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ సినిమాలో ప్రభాస్ కి హీరోయిన్ గా బాలీవుడ్ భామలు దీపికా పదుకునే, అనుష్క శర్మ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. టాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క పేరు కూడా వినిపిస్తోంది. అయితే వీరిలో ఎవరు ఫైనల్ అవుతారన్నది చూడాల్సి ఉంది. ఈ సినిమాను టిసిరీస్ బ్యానర్ పై కిరణ్ కుమార్, భూషణ్ కుమార్ లు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల పై క్లారిటీ రావడంతో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమాలోనూ నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తిచేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు.

More Related Stories