ప్ర‌భాస్ అనుష్క ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూPrabhas-Anushka-Exclusive-Interview
2017-04-17 04:19:09

దేవ‌సేన‌, అమ‌రేంద్ర  బాహుబ‌లి ఈ పేర్లు ఇప్పుడు భార‌తీయ సినిమా ప్రేక్ష‌కుల‌కు చాలా ప‌రిచ‌యం అయిన పాత్ర‌లు
వారి ప్రేమ‌క‌థ‌, వారి పై జ‌రిగిన కుట్ర‌ల గురించి తెలుసుకోవాల‌ని త‌హా త‌హా లాడ‌ని సినిమా అభిమాని  ఉండ‌డేమో
తెలుగు సినిమా గా మొద‌లై భార‌తీయ సినిమా ఎదిగి అంత‌ర్జాతీయ ఖ్యాతినార్జించిన సినిమా బాహుబ‌లి ది క‌న‌క్లూజ‌న్ కి వ‌చ్చేసింది ప్ర‌మోష‌న్స్ లో భాగంగా దేశం అంతా తిరుగుతుంది రాజ‌మౌళి అండ్ టీం.. తెలుగుమీడియాతో మాట్లాడేందుకు ఈ రోజు టైం కేటాయించారు దేవ‌సేన అండ్ అమ‌రేంద్ర బాహుబ‌లి ప్ర‌పంచ‌స్థాయి కి ఎదిగిన బాహుబ‌లి ఎక్స్ పీరియ‌న్స్ లో పంచుకున్నారు వాటిలో కొన్ని హైలెట్స్ చూద్దాం..

ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో బాగా బిజీగా ఉన్న‌ట్లున్నారు ప్ర‌భాస్..?

కెరియ‌ర్ లో ఎప్పుడూ మాట్లాడ‌నంత ఇప్పుడు మాట్లాడుతున్నాను.. బాగుంది డిఫ‌రెంట్ ప్లేస్ లో ప్ర‌మోష‌న్స్ చేయ‌డం నిజంగా కొత్త ఎక్స్ పీరియ‌న్స్

అనుష్క

సినిమా స్కేల్ ని బ‌ట్టి ప్ర‌మోష‌న్స్ ఉంటాయి. అందుకే బాహుబ‌లికి ప్ర‌మోష‌న్స్ కూడా ఎక్కువుగానే ఉన్నాయి. ఈ పార్ట్ ని కూడా ఎంజాయ్ చేస్తున్ఆనం.

మీరు క‌థ చెప్పిన‌ప్పుడు ఎక్కువ ఎగ్జైట్ అయిన విష‌యం ఎంటి...?

ప్రః యేడేళ్ళ క్రిత‌మే రాజ‌మౌళి పెద్ద సినిమా చేస్తున్నాం అన్నారు.. రెబ‌ల్ డ‌బ్బింగ్ అప్పుడు క‌థ చెప్పారు.. బ‌య‌టికి రావ‌డాన‌కి  ఆట్రాన్స్ లోంచి రెండు రోజులు ప‌ట్టింది.  అప్పుడే ఫిక్స్ అయ్యాను.. 

ఇలాంటి పాత్ర‌లు మీకు చాలా ఎర్లీ అనే ఫీలింగ్ క‌లిగిందా..? ఏమైనా భ‌య‌ప‌డ్డారా..?

ప్రః డెఫెనిట్ గా ఆ భ‌యం ఉంటుంది. రాజ‌మౌళికి, నిర్మాత‌ల‌కు నాకు అంద‌రికీ ఉంటుంది. కాక‌పోతే ఫ‌స్ట్ పార్ట్ మా భాయాల్ని చాలా తగ్గించింది.. కాస్త రిలీఫ్ అయ్యాం.

దేవ‌సేన గురించి చెప్పిన‌ప్పుడు మీకొచ్చిన ఫ‌స్ట్ పీలింగ్ ఏంటి..?

అః చేయ‌గ‌ల‌మ‌నే న‌మ్మ‌కం ఉంది. (ప్ర‌భాస్ మ‌ద్య‌లో మాట్లాడుతూ.. క్వీన్ క్యారెక్ట‌ర్ నీకు అల‌వాట‌య్యింది. పుట్టిన‌ప్పుడి నుండి క్వీన్ లాగే  ఉన్నావు..న‌వ్వూతూ.. మ‌ద‌ర్ క్యారెక్ట‌ర్ గురించి చెప్పు)  ఆ మ‌ద‌ర్ క్యారెక్ట‌ర్ అంటే కొంచెం ఆలోచించాను.. రాజ‌మౌళి గారు కాక‌పోతే చేసేదాన్ని కాదేమో.. ఎందుకంటే మిర్చి త‌ర్వాత  మా కాంబినేష‌న్ అని ఆలోచించేదాన్ని.. బ‌ట్ ఆ క్యారెక్ట‌ర్ లో చాలా ఎమోష‌న్స్ ఉన్నాయి. కానీ రాజ‌మౌళి గారు కాక‌పోతే చేసేదాన్ని కాదేమో..(న‌వ్వుతూ)

అనుష్క‌ను క్వీన్ లా చూడ‌టానికి చాలా రోజులు ప‌ట్టింది.. అలా మీకేమ‌న్నా అనిపించిందా..?

అలా అనిపించ‌లేదు కంటిన్యూస్ గా వ‌ర్క్ చేస్తున్నాం క‌దా.. అలా అనిపించ‌లేదు. మీరు అడిగితే త‌ప్పనాకు ఆ విష‌యం గుర్తుకు రాలేదు

ఇంత టైం పుడుతుంద‌ని చెప్పారా మీకు...?

ప్రః చెప్ప‌లేదు.. రెండు న్న‌ర సంవ‌త్స‌రాలున్నారు అప్పుడే నేను కాదు మ‌రో సంవ‌త్స‌రంన్నార ప‌డుతుంద‌ని అన్నాను.. ఎందుంకంటే నాకు అందులే ఒక వ‌ల్డ్ క్లాస్ సినిమా కనిపించింది. లైఫ్ లో ఇలాంటి అవ‌కాశం ఒక‌సారే వ‌స్తుంది.  కాబ‌ట్టి టైం పెద్ద ప్రాబ్ల‌మ్ అనిపించ‌లేదు.

ఇన్ని లాంగ్వేజ్ లు ముందు ఊహించారా..?

ప్రః వ‌ర్క్ షాప్ లోనే తెలుగు, త‌మిళ డైలాగ్స్ ప్రాక్టీస్ చేసాం.  తెలుగులో వ‌ర్క్ అవుట్ అయితే త‌మిళం లో కూడా వ‌ర్క్ అవుట్ అవుతుంద‌ని అనుకున్నాం. కానీ హిందీ కొచ్చేస‌రికి అంత కాన్ఫిడెంట్ లేదు. ఎందుకంటే అంద‌రూ సౌత్ ఇండియ‌న్ ఆర్టిస్టే లే ఉన్నారు. కానీ నాకు ఆ భ‌య‌లు ఏమీ లేవు.. లైఫ్ లో ఎన్ని సినిమాలు చేస్తాం.. ఇలాంటి సినిమా వ‌చ్చిన‌ప్పుడు ఎందుకు ఆలోచించాలి అనుకున్నాను.
రాజ‌మౌళి గారి ఫ్యామిలీని చూస్తుంటే ముచ్చ‌టేస్తుంది. ఒక ప్యామిలీ అంతా ఒకేమాట మీద నిల‌బ‌డ‌టం చాలాక‌ష్టం 

అనిపిస్తుంది. మీరేమంటారు..?

ప్రః అది మామూలు విష‌యం కాదు. వాళ్ల పిల్ల‌లు అంతా నాముందే పెరిగారు. కానీ వారి కుటుంబంలో ఎక్క‌డా ఇగోలు క‌నిపించ‌వు.. వాళ్ల పిల్ల‌లంద‌రూ నాముందు పెరిగారు. రాజ‌మౌళి గారి అబ్బాయి కార్తికేయ ఒక ఐస్ క్రీమ్ పార్ల‌ర్ లో ప‌నిచేసేవాడు . అప్పుటికీ రాజ‌మౌళి మ‌గ‌ధీర వంటి హిట్స్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు. వాళ్ల‌కుటుంబం లో క‌ష్టానికి విలువ తెలిసిన మ‌నుషులు ఎక్కువ‌. అదే వారిని ఈ స్థాయికి తెచ్చిందేమో అనిపిస్తుంది. ఫ‌స్ట్ పార్ట్ లో త‌మన్నా గ్లామ‌ర్ గా కినిపించింది. పోరాటాలు చేసింది ఈ పార్ట్ లో మీపాత్ర ఎలా ఉండ‌బోతుంది
అః గ్లామ‌ర్ ఉంది.. చాలా ఎమోష‌న్స్ ఉన్నాయి. మంచి పాట‌లున్నాయి.. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు.

ఈ టీం లో ఎవ‌రు స్వీటెస్ట్..?

ప్రః నాకు తెలిసి అందరికీ ఎదో ఒక పిచ్చి ఉంది... కానీ అవి మీకు చెప్ప‌కూడ‌దు
అః త‌మ‌న్నా అనుకుంటా.. చాలా బాలెన్స్ గా ఉంటుంది. అల‌సిపోయిన విష‌యం మాకు తెలుస్తూనే ఉంటుంది.కానీ ఒక‌సారి సెట్ పైకి వ‌చ్చాక పుల్ ఎనర్జీ గా ఉంటుంది. స్మైల్ ని ఎప్పుడూ చెద‌ర‌నివ్వ‌దు..

పెళ్ళి గురించి ఏం చెబుతారు..?

ప్రః నాకే తెలియ‌దు.. అంటే ల‌వ్ మ్యారేజ్ లా ఎరేంజ‌డ్ మ్యారేజ్ అనికూడా తెలియ‌దు.. 
అః నిజంగా ఏమీ ప్లాన్స లేవు. అది ఒక ఈవెంట్ అది జ‌ర‌గాలి.. నెక్ట్స్ మంత్ ఉండొచ్చు.. మ‌రో ఆరేళ్ళు ప‌ట్టొచ్చు( అమ్మ తిడుతుంది..న‌వ్వుతూ )

అంచానాలు పెరిగాయి.. క‌దా..? ప‌్ర‌జ‌ర్ ఉందా..?

ప్రః రాజ‌మౌళి మీరు అనుకున్న‌దానికంటే ఎక్కువ ఇవ్వ‌డం తెలుసు. ఫ‌స్ట్ పార్ట్ లోనే అది నిరూపించాడు.. ఇక సెకండ్ 

పార్ట్ లోకూడా మిమ్మ‌ల్ని మెస్మ‌రైజ్ చేస్తాడు..?

అః  ఇట్స్ విజువ‌ల్ ట్రీట్. లాట్ ఆఫ్ ఎమోష‌న్స్ ఆడియ‌న్స్ కి క‌నెక్ట్ అవుతాయి.  మాకేం ప్ర‌జ‌ర్ లేదు.
తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఒక నూత‌న అధ్యాయం గా మారిన బాహుబ‌లి అనుష్క‌, ప్ర‌భాస్ ల‌కు లార్జ‌ర్ దాన్ లైఫ్ ఇమేజ్ నిచ్చింది అన‌డంలో సందేహం లేదు. అది వారి ప్ర‌తి మాట‌లో  న‌మ్మ‌కంగా క‌నిపించింది

More Related Stories