ప్రభాస్ బర్త్ డే స్పెషల్..ఫ్యాన్స్ కు గిఫ్ట్ ఇదే Prabhas
2020-10-23 23:47:21

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈరోజు తన 36వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, ప్రభాస్ అభిమానులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ప్రభాస్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా తాజాగా ప్రభాస్ అభిమానుల్లో జోష్ ను పెంచడానికి ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ను ఇచ్చింది. ఈ మేరకు "రాధే శ్యామ్" మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది. బిట్స్ ఆఫ్ రాధే శ్యామ్ పేరుతో ఈ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మోషన్ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ గా ఉందంటూ అభిమానులు అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా బాహుబలి తరవాత ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ "సహో" అనే సినిమాలో నటించారు. ఈ సినిమా అంతగా ఆడలేదు. ఇక    సాహో తరవాత ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా పిరియాడిక్ లవ్ స్టొరీ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కు జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు అందిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది.

More Related Stories