ఫ్రెండ్ కోసం కొడుక్కి ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్Prabhas
2020-07-11 20:09:54

ప్రభాస్ నటనా కెరీర్ లో మొదటి హిట్ సినిమా వర్షం అనే చెప్పాలి. ఆ సినిమా డైరెక్టర్ శోభన్ ప్రభాస్ కి మంచి స్నేహితుడు లాంటి వాడు. అయితే శోభన్ 2008లోనే మరణించారు. శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా, ఆ తర్వాత హీరోగా చేయని ప్రయత్నా లేదు. సంతోష్ శోభన్ గోల్కొండ హై స్కూల్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా, పేపర్ బాయ్, తను నేను సినిమాలలో హీరోగా నటించినా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇటీవల ప్రభాస్ సొంత బ్యానర్ యూవీ క్రియేషన్స్ లో యంగ్ హీరోలతో మాములు బడ్జెట్ సినిమాలు చేద్దామని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎలా అయిన తన ఫ్రెండ్ శోభన్ కొడుకు సంతోష్ శోభన్ కు మంచి హిట్ ఇవ్వాలని ప్రభాస్ భావిస్తోన్నట్టు తెలుస్తోంది. అయితే ఏకంగా యూవీ క్రియేషన్స్ లో సంతోష్ 2 సినిమాలకు సైన్ చేశాడని అంటున్నారు. కరోనా ప్రభావం తగ్గాక అవి ఒక్కొక్కటిగా సెట్స్ మీదకు వెళ్తాయని అంటున్నారు.  

More Related Stories