ప్రభాస్ బాహుబలి విరాళం... అందర్ని మించిపోయాడుగా...Prabhas.jpg
2020-03-27 18:19:48

ప్రభాస్ ఊహకు కూడా అందని సంచలనం సృష్టించాడు. పవన్ కళ్యాణ్ 2 కోట్లు విరాళం ఇస్తేనే ఆహా ఓహో అనుకున్నాం. కానీ ఇప్పుడు దానికి రెండితలు ప్రకటించాడు ప్రభాస్. ఏకంగా 4 కోట్ల విరాళం ఇచ్చేసాడు బాహుబలి. ఇది చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మా హీరో అంటే ఇది అంటూ కాలర్ ఎగరేస్తున్నారు. హిందీలోనూ ప్రభాస్ కు సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

బాహుబలి తర్వాత విడుదలైన సాహో కూడా అక్కడ విజయం సాధించింది. దాంతో అక్కడి వాళ్ల కోసం కూడా ప్రధాన మంత్రి సహాయ నిధికి ఏకంగా 3 కోట్లు ఇచ్చాడు ప్రభాస్. ప్రస్తుతం ఈయన ఫారెన్ షూటింగ్ నుంచి వచ్చి హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నాడు. ఈ క్రమంలోనే కరోనా బాధితుల సహాయార్థం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు చెరో 50 లక్షలు అనౌన్స్ చేసాడు. ఆ తర్వాత కొన్ని గంటలు గ్యాప్ తీసుకుని పిఎం రిలీఫ్ ఫండ్ కు ఏకంగా 3 కోట్లు ప్రకటించాడు.

ఉత్తరాది ప్రేక్షకులు బాహుబలి రూపంలో తనను ఎంతగానో ఆదరించారని ప్రభాస్‌కు తెలుసు. అందుకే వాళ్ల బాగోగులను ఇప్పుడు ప్రభాస్ కూడా చూసుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలోనే ఇంత భారీగా విరాళం అందించిన హీరో ఎవరూ లేరు. పవన్ కళ్యాణ్ 2 కోట్లు ఇస్తే.. దానికి రెండింతలు విరాళం ప్రకటించి సంచలనం సృష్టించాడు ప్రభాస్.

More Related Stories