అందరితో రాని ఇబ్బంది సమంతాతోనే వచ్చిందా  Prabhas
2020-04-25 11:16:54

తెలుగులో ఇప్పుడు క్రేజ్ ఉన్న హీరోలలో ప్రభాస్ మొదటి వరుస ఉంటాడు, ఇక అలానే హీరోయిన్స్ లో సమంతా. ఈ ఇద్దరి సినిమాలు వస్తున్నాయంటే మినిమం మార్కెట్ ఉంటుంది. ఇక రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రభాస్ కి ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంటే.. సమంతకు కూడా దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తారని ఇప్పుడు కాదు ఏకంగా పదేళ్ళ నుండి ప్రచారం జరుగుతోంది. కానీ వాళ్ళు కలిసి ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా తియ్యలేదు. ఇక తియ్యరు కూడా అట. ఎందుకంటే ప్రభాస్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు సమంతకు హైట్ ప్రాబ్లెమ్ ఉంది అని.. అందుకే కలిసి సినిమా చెయ్యలేదని చెప్పాడు. నిజానికి సమంత అంత పొట్టిగా అయితే ఉండదు.. కానీ ప్రభాస్ ఆరు అడుగుల అందగాడు.. పొట్టిగానే కనిపిస్తుంది. మరి మిగతా హీరోయిన్స్ ని మేనేజ్ చేసినట్టు ఈమెను ఎందుకు మేనేజ్ చేయలేకపోతున్నాడు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే ప్రభాస్ మిగతా హీరోయిన్స్ తో ఎవరితో అయోతే సినిమాలు చేశాడో వాళ్ళు కూడా ప్రభాస్ తో పోలిస్తే పోట్టివాల్లె. మరి వాళ్ళతో రాణి ఇబ్బంది మనోడికి సమంతాతో ఎందుకు వచ్చిందా అని అనుకుంటున్నారు. 
 

More Related Stories