షాకింగ్ న్యూస్..ఓటీటీలో రాధే శ్యామ్



Radhe Shyam
2021-05-04 19:28:35

కరోనా విజృంభనతో థియేటర్లకు నష్టం రాగా ఓటీటీకి మాత్రం లాభం చేకూరింది. థియేటర్ లో విడుదలకు సిద్ధం గా ఉన్న సినిమాలు ఓటీటీలోకి రావడంతో ప్రేక్షకుల కన్ను ఓటీటీ పై పడింది. దాంతో ఓటీటీకి డిమాండ్ పెరిగింది. మరోవైపు చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు ఓటీటీ ని ఎంచుకోవడం విశేషం. 

ఇక కరోనా ఎఫెక్ట్ తగ్గిన తరవాత మళ్లీ థియేటర్లలో సందడి కనిపించినా రెండు మూడు వారాలు తరవాత అవే సినిమాలు ఓటీటీ కి రావడంతో  డిజిటల్ ప్లాట్ ఫామ్ క్రేజ్ తగ్గలేదు. ఇక ప్రస్తుతం కరోనా విజృంభనతో మళ్లీ థియేటర్ లు మళ్లీ మూతపడ్డాయి. దాంతో మళ్లీ చిన్న సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి. అంతే కాకుండా కొన్ని పెద్ద సినిమాలు కూడా నేరుగా ఓటీటీలో విడుదలవుతాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

ఇక ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని జులై 30న థియేటర్లో విడుదల చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించింది. కానీ అప్పటివరకు కూడా కరోనా ఉధృతి తగ్గేలా లేదు. దాంతో పే పర్ వ్యూ విధానంలో విడుదల చేస్తారట. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన రాధే సినిమాను కూడా మే13న అలానే విడుదల చేయబోతున్నారు.

More Related Stories