రాధేశ్యామ్ నుండి ట్రైలర్ అప్డేట్



prabhas radhe shyam
2021-01-05 15:20:04

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్. ఈ సినిమాను "జిల్" చిత్రాన్ని తెరకెక్కించిన రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. సినిమాలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అంతే కాకుండా బాలీవుడ్ నటీనటులు సైతం ఈ సినిమాలో ఉన్నారు. దాంతో సినిమాను మొత్తం ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. పిరియాడికల్ లవ్ డ్రామాగా రాధే శ్యామ్ ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్లను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పోస్టర్లు ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. దాంతో ప్రభాస్ అభిమానులు సినిమా ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరగా ట్రైలర్ ను విడుదల చేయాలంటూ కోరుతున్నారు. కాగా తాజాగా ఈ సినిమా దర్శకుడు రాధాకృష్ణ ఓ అప్డేట్ ను ఇచ్చారు. ఇంతకాలం ఓపికగా వెయిట్ చేసిన ఫ్యాన్స్ కు తగ్గ ప్రతిఫలం ఉంటుందన్నారు. త్వరలోనే ట్రైలర్ వచ్చే డేట్ ను ప్రకటిస్తామని చెప్పారు. రాధాకృష్ణ చేసిన ట్వీట్ తో సంక్రాంతికి "రాధే శ్యామ్" ట్రైలర్ రాబోతుందని ప్రభాస్ అభిమానులు అనుకుంటున్నారు.

More Related Stories