సలార్ స్టార్ట్..చీఫ్ గెస్ట్ గా రాఖీ బాయ్ Prabhas Salaar
2021-01-16 04:00:25

టాలీవుడ్ యంగ్ హీరో ప్రభాస్ వరుస  చేస్తూ ఇండస్ట్రీ లో బిజీగా మారిపోయాడు. బాహుబలి సినిమా తరవాత అటు బాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలలో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. దాంతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రభాస్ తో సినిమా చేసేందుకు స్టార్ డైరెక్టర్ లు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ "జిల్" ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో "రాధే శ్యామ్ " అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తిచేస్తున్నారు. ఈ సినిమా తరవాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఇప్పటికే సినిమా టైటిల్ ను "సలార్" గా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక తాజాగా సలార్ చిత్రాన్ని హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభించారు. హోంబలే ఫిల్మ్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా పూజాకార్యక్రమంలో హీరో యశ్ ముఖ్య అతిధి గా హాజరయ్యాడు. పూజా కార్యక్రమానికి ప్రభాస్ వైట్ కుర్తాతో హాజరయ్యాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పటికే విడుదలైన సలార్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. నటీనటుల వివరాలను చిత్రయూనిట్ త్వరలోనే ప్రకటించనుంది.

More Related Stories