ప్రభాస్ సినిమాలకేమయ్యింది...ఎందుకీ వరుస ప్రమాదాలు



Prabhas Salaar
2021-02-03 18:25:17

ప్రభాస్ నటిస్తున్న సినిమాలకు ఏమయ్యింది. ఎందుకిలా వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అటు ఆది పురుష్ సెట్ లో అగ్నిప్రమాదం..కొన్ని గంటల్లోనే సలార్ యూనిట్ సభ్యులకు రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా షూటింగ్ ప్రస్తుతం తెలంగాణలోని గోదావరి ఖని బొగ్గు గనుల్లో షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.  అయితే షూటింగ్ తరవాత  యూనిట్ సిబ్బంది వ్యాన్ భయటకు వెళ్లగా గోదావరి ఖని శ్రీనగర్ వద్ద యూటర్న్ తీసుకునే సమయంలో టిప్పర్ లారీ  వ్యాన్ ను ఢీ కొట్టింది. ఏ ఘటనలో యూనిట్ సభ్యులు స్వల్పంగా గాయపడ్డారు. ఇక ఈ సినిమా సినిమాకు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. 

మరోవైపు ఆది పురుష్ సినిమా షూటింగ్ నిన్ననే మొదలైంది. అయితే షూటింగ్ సెట్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సెట్ కోసం వేసిన గ్రీన్ స్క్రీన్ కోమ సెటప్ మొత్తం కాలిపోయి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం చోటు చేసుకోకపోవడంతో యూనిట్ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రభాస్ నటిస్తున్న రెండు సినిమాల కు సంబందించి ఒకేరోజు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. డార్లింగ్ సినిమాలకు ఏమయ్యింది ఎందుకిలా ఒకే రోజు రెండు ఘటనలు అని ఆందోళన చెందుతున్నారు.

More Related Stories