ఆస్పత్రికి వెళ్లనున్న ప్రభాస్..Prabhas
2020-04-02 01:58:52

బాహుబలితో దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ ఆ తరువాత భారీ బడ్జెట్ సినిమా ‘సాహో’ లో నటించాడు.  ఈ సినిమాలో హీరోయిన్ గా కూడా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ ను తీసుకున్నారు. కానీ పాన్ ఇండియా సినిమాగా విడుదలైన సాహో అనుకున్నంత హిట్ కాలేకపోయింది. కాగా ప్రస్తుతం ప్రభాస్ 20వ సినిమా " జిల్ "సినిమా దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో  చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ సినిమాకు "జాన్" "ఓ మై డియర్" "రాధే శ్యాం"  అనే పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేస్తారని ఇప్పటికే నిర్మాత ప్రకటించారు. ఈ సినిమాలో పూజ హెగ్డే ప్రభాస్ సరసన నటిస్తుంది. సినిమా ఓ రొమాంటిక్ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  

ఇదిలా ఉండగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆస్పత్రికి వెళ్లనున్నారట. అయితే ప్రభాస్ వెళ్ళ్లేది నిజంగా ఆస్పత్రికి కాదు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న "జాన్"  సినిమా షూటింగ్ ఎక్కువ శాతం విదేశాల్లోనే ప్లాన్ చేసారు కాగా కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఈ సినిమాకు సంబంధించి ఒక కీలక సన్నివేశాన్ని జార్జియాలో సెట్ వేసి చిత్రిస్తుండగా అక్కడ కరోనా విజృంభణ కారణంగా షూటింగ్ ను నిలిపివేసి తిరిగి ఇండియాకు వచ్చారు.  ఇప్పుడు ఆ సన్నివేశాల కోసం హైదరాబాద్  లోనే ఆస్పత్రి సెట్ వేసి షూటింగ్ పూర్తి చేయాలనే  ఆలోచనలో చిత్ర బృందం ఉందట. 

More Related Stories